దాదాపు 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ  ఇస్తూ  బాలీవుడ్ హిట్ మూవీ అయినా పింక్ తెలుగు రీమేక్ లో  నటిస్తుండడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చూపు మొత్తం పవన్ కళ్యాణ్ 26 సినిమా పైన ఉంది. అయితే పవన్ కళ్యాణ్ 26వ సినిమా టైటిల్ విషయమై గత కొన్ని రోజులుగా సస్పెన్స్  నెలకొంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు చక్కర్లు  కొట్టాయి. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ముఖ్యంగా వకీల్ సాబ్ అనే పేరు పవన్ కళ్యాణ్ 26వ సినిమాకి ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తాజాగా ఈ సస్పెన్స్ కు తెర దించుతూ చిత్ర బంధం అంటూ వకీల్ సాబ్ అనే  టైటిల్ ను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అయితే ఈ టైటిల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. 

 

 

 దీంతో ఈ టైటిల్ విషయంలో ప్రేక్షకులను అంతగా ఆశ్చర్యం ఏమీ లేదు కానీ... పవన్ ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ ఫస్ట్ లుక్ తో పండగ చేసుకుంటే... కొంతమంది సినీ ప్రేక్షకులు మాత్రం పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పై కాస్త ఎబ్బెట్టుగా నే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మాత్రం ఈ సినిమా స్టొరీ కి విరుద్ధంగా ఉంది. కమర్షియల్  సినిమాకు ఉన్నట్టుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉంది. సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా స్టోరీ కూడా ఏమైనా మార్చరా అనే అనుమానం కూడా రాకపోదు.

 

 

 అయితే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకు ఇలాంటి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో కొంత మంది ఈ ఫస్ట్ లుక్ ను  మర్చిపోలేకపోతున్నారూ.ఈ క్రమంలోనే  పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక కొంతమంది సినీ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పై కాస్త భిన్నంగా నే స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ వకీల్ సాబ్ లా  లేదు ఓవరాక్షన్ సాబ్ లా  ఉంది.. నాచురాలిటీ ఎక్కడో మిస్సయింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ లో మొత్తం కమర్షియల్ హంగులు ఉన్నాయని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఫస్ట్ లుక్ లా  లేదు అంటున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే నాచురాలిటీ కి దగ్గరగా ఉండాలని చెబుతున్నారు. మొత్తంగా ప్రస్తుతం పవన్ ఫస్ట్ లుక్ పై  మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: