పవర్ ఫుల్  హీరోయిజానికి మారుపేరైన నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం హీరోఇజం ను  బాగా ఎలివేట్ చేసే దర్శకుడు బోయపాటి తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన లెజెండ్ సింహా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి సమయంలో ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో... అటు నందమూరి అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బాలయ్యకి సరైన హిట్ లేదు అన్న విషయం తెలిసిందే. అందుకే బాలకృష్ణ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి బాలకృష్ణ కొత్త లుక్ లోకి మారి పోవడం కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా హాట్రిక్ విజయం గా  మారబోతుందా అని టెన్షన్ లో ఉన్న అభిమానులందరికీ మరో కొత్త టెన్షన్ పట్టుకుంది. 

 

 

 ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను బాలకృష్ణ పుట్టిన రోజు నాడు విడుదల చేయాలని బోయపాటి భావిస్తున్నారు అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఓ వార్త  హల్చల్ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు ఆలస్యంగా మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పుట్టిన రోజు అయిన జూన్ పదవ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా లేదా  అనే చర్చ నందమూరి అభిమానుల్లో  మొదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దర్శకుడు బోయపాటి ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని... దీంతో షూటింగ్ ఎక్కడ ఆలస్యం జరగదు అంటున్నారు మరికొంతమంది. 

 

 

 ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. నందమూరి అభిమానులు కోరుకున్నట్లుగానే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బాలయ్య పుట్టినరోజు నాడు జూన్ 10వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా బాలయ్య పుట్టినరోజు నాడు ఈ సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నా అభిమానులు కొందరైతే... ఈ సినిమా ఆలస్యం అయినా పర్లేదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ రావాలని కోరుకుంటున్నా అభిమానులు ఇంకొంతమంది. మొత్తానికి ఈ సినిమాను బోయపాటి ఎప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారూ అన్నది  మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: