కోట్ల బడ్జెట్ సినిమాలొచ్చినా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నా సరే ఇంట్లో ఉన్న మహిళలకు సీరియల్సే చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ టైం వచ్చింది అంటే టీవీలకు అతుక్కుపోవడమే వారి పని. ఇక ప్రస్తుతం స్టార్ మాలో కార్తికదీపం ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతుంది. సోషల్ మీడియాలో వంటలక్క ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. సీరియల్ ప్రతిరోజు అప్డేట్స్ తో మీమ్స్ కూడా తయారు చేసి హడావిడి చేస్తుంటారు. అయితే కొద్దిరోజులుగా కార్తిక దీపం సీరియల్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.  

      

స్టార్ మా సీరియల్ ను హాట్ స్టార్ లో వి.ఐ.పి ఎకౌంట్ ఉన్నవారు ముందే సీరియల్ చూసేయడం.. చూసిన వాళ్లు ఊరకనే ఉండక దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం చేస్తున్నారు. ఇదే సీరియల్ టి.ఆర్.పి రేటింగ్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. అంతేకాదు సీరియల్ నుండి వంటలక్క అలియాస్ దీప బయటకు వెళ్తుందన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే వీటన్నిటికి సమాధానం చెప్పేందుకు దీప పాత్ర చేస్తున్న ప్రేమి విశ్వనాథ్ లైవ్ లోకి వచ్చింది. ఓ సీరియల్ హీరోయిన్ లైవ్ లోకి రావడం ఫ్యాన్స్ ను పలుకరించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

   

సీరియల్ పై ఉన్న అభిమానుల డౌట్స్ అన్ని ప్రేమి విశ్వనాథ్ తీర్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు సీరియల్ నుండి తను తప్పుకుంటానని వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ప్రేమి విశ్వనాథ్. తనని.. సీరియల్ ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. స్టార్ మాలో నంబర్ 1 సీరియల్ గా కొనసాగుతున్న కార్తికదీపం సీరియల్ కు తెలుగు రెండు రాష్ట్రాల్లో మహిళా ప్రేక్షకులు సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సీరియల్ ఎప్పుడో ముగిస్తుందని అన్న విషయంపై క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: