జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఉండే క్రేజ్ అంత ఇంతా కాదు. ఆయన మీద అభిమానుల్లో ఒక బలమైన ప్రేమ ఉంటుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, రాజకీయాల్లో ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే ఆయనకు ఉండే క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదని స్పష్టంగా అర్ధమవుతుంది. సాధారణంగా హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే ఫాలోయింగ్ తగ్గుతుంది. 

 

కాని పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆయనకు ఉండే ఫాలోయింగ్ టాలీవుడ్ లోనే ఎవరికి లేదు. దేశంలో కూడా ఎవరికి లేదు అనేది వాస్తవం. సినిమా పరంగా కంటే ఆయనను వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. తాజాగా ఆయన సినిమా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దాదాపు రెండేళ్ళ తర్వాత ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. దీనితో ఆయన సినిమా మీద అందరిలో ఆసక్తి ఎక్కువగా నెలకొంది. 

 

ఇక ఈ సినిమా లుక్ విడుదల అయిన వెంటనే సోషల్ మీడియాలో మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే వాట్సాప్, ఫేస్బుక్ లో ఆయన ఫోటో వైరల్ అవుతుంది. దేవుడి సినిమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి వీడియోలు కూడా చేస్తున్నారు. ఇక కొంత మంది అయితే పవన్ కళ్యాణ్ తమ ఇంట్లో పడుకున్నట్టు ఫోటోలు ఎడిట్ చేస్తున్నారు. ఈ ఫోటో కి వస్తున్న క్రేజ్ చూస్తే ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అవుతుందని పలువురు కామెంట్ చేయడం విశేషం. ఇక కొంత మంది సినిమా విజయ౦ కోసం పూజలు చేయడం విశేషం. మరి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: