నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎంట్రీ నందమూరి మోక్షజ్ఞ. బాలకృష్ణ తనయుడు గా మొక్షు ఎంట్రీ కోసం చాలా ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే మొక్షు ఎంట్రీ పై అభిమానులు ఎన్నో రకాల కామెంట్ లు చేస్తున్నారు. ఇటీవల అతని ఎంట్రీ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అతను కచ్చితంగా సినిమాల్లోకి త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వచ్చే అవకాశం ఉందని, అన్న ఎన్టీఆర్ సినిమాలో ఆయన నటిస్తాడని ప్రచారం జరిగింది. 

 

అలాగే రాజమౌళి ద్వారా సినిమాల్లోకి వస్తాడని కూడా అన్నారు. బాలకృష్ణ అతని కోసం అమెరికా కూడా వెళ్ళారు అనేది కొందరి మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అతని బరువు చూసిన అభిమానులు ఇది నిజమే అనుకున్నారు. అమెరికా వెళ్లి శిక్షణ కూడా తీసుకుంటున్నాడని ప్రచారం చేసారు. బాలకృష్ణ కూడా త్వరలోనే అతను సినిమాల్లోకి వస్తాడని అన్నారు. సినిమాల గురించి చర్చ తమ ఇంట్లో జరుగుతుందని ఆయన అన్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని బాలకృష్ణ మాత్రం కుమారుడి ఎంట్రీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 

 

ఇక నందమూరి అభిమానులు కూడా ఆయన ఎంట్రీ మీద ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ లతో పాపం వాళ్ళు ఇవాళ రేపు అంటూ ఆశగా ఎదురు చూస్తున్నా ఏమీ సమాచారం రావడం లేదు. మాస్ కథ అని ఒక సారి అంటుంటే కాదు పౌరాణికం అని మరికొన్ని సార్లు అంటున్నారు. మరి అలాంటి సినిమాలు ఈ రోజుల్లో ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చెప్ప లేని పరిస్థితి. మరి ఈ ఏడాది ఎంట్రీ ఉంటుందో వచ్చే ఏడాది ఉంటుందో బాలకృష్ణే చెప్పాలి. మీడియా లో కూడా ఆయన కుమారుడు పెద్దగా కనపడటం లేదు. దీనితో సినిమాల మీద ఆసక్తి లేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: