యంగ్ హీరో నితిన్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ను టార్గెట్ చేశాడు. ఫ్లాప్స్ లో ఉన్నాడా.. సక్సెస్ లో ఉన్నాడా అనేది పట్టించుకోవడం లేదు. దీంతో హిట్ కొట్టి ఫ్లాప్స్ తో వెనుకబడిన కుర్ర దర్శకులు ఇప్పుడు నితిన్ ను నమ్ముకున్నారు. మరి నితిన్ ఇస్తున్న లిఫ్టింగ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ మల్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా..?

 

ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత భీష్మతో బిగ్ హిట్ కొట్టాడు. ఇప్పటికే జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ సాగిస్తున్నాడు. వరుస ఫ్లాపులను తట్టుకొని గెలిచిన హీరోగా నితిన్ స్పెషల్ ట్రాక్ రికార్డ్ ఉంది. పన్నెండు ఫ్లాపుల తర్వాత ఇష్క్ తో హిట్ కొట్టినప్పటి ఎమోషన్ నితిన్ ఇంకా మరిచిపోలేదు. అందుకే నాలుగు ఫ్లాప్స్ తర్వాత ఇప్పుడు భీష్మతో హిట్ కొట్టడంతో నితిన్ అలాంటి ఎమోషన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. 

 

బ్లాక్ బస్టర్ కొట్టిన నితిన్ ఇప్పడు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. యంగ్ డైనమైట్స్ వెంకీ అట్లూరి, మేర్లపాక గాంధీ, కృష్ణ చైతన్యలతో వరుసగా సినిమాలు చేయనున్నాడు. అలాగే సీనియర్ చంద్ర శేఖర్ ఏలేటితోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకులతో నితిన్ ఫోటోకు ఫోజిచ్చి తర్వాత చేయబోతున్న సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. 

 

రైటర్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్యకు నితిన్ మరో ఛాన్స్ ఇచ్చాడు. లాస్ట్ టైమ్ ఈ కాంబినేషన్ లో వచ్చిన ఛల్ మోహన్ రంగా నిరాశపరిచింది. ఇక తొలిప్రేమతో హిట్ కొట్టి మిస్టర్ మజ్ఞుతో బోల్తాపడ్డ వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రన్ రాజా రన్ తో హిట్స్ ఇచ్చిన మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధంతో నిరాశపరిచాడు. ఈ దర్శకుడితో అంధూదాన్ రీమేక్ చేస్తున్నాడు. మరి యంగ్ డైరెక్టర్స్ హిట్ ఇచ్చి నితిన్ నమ్మకాన్ని నిలబెడతారా చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: