కమల్ హాసన్-క్రియోటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో రికార్డ్స్ ని క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో భారతీయుడిగా వచ్చిన ఈ సినిమాకి ఇప్పటికీ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నేళ్ళుగా శంకర్ ఇండియన్ 2 రాబోతుందని ఊరిస్తూ వచ్చారు. ఎట్టకేలకి ఈ సినిమా ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రీసెంట్ గా ఇండియన్-2’ సినిమా సెట్ లో  క్రేన్ ప్రమాదం జరగడం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. 

 

చెన్నైలోని షూటింగ్ స్పాట్ లో ఫోకస్ లైట్లున్న భారీ క్రేన్ తెగి కింద పడటంతో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ - ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్ - ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు మరణించగా...మరి కొంతమంది దారుణంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో చిత్ర యూనిట్ షాకైంది. అయితే ఇది ముమ్మాటికి మేకర్స్ తప్పేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించిన భారీ క్రేన్ ను ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ చేపట్టిన సీబీసీఐడీ.. దర్శకుడు శంకర్ ను విచారించారు. తాజాగా హీరో కమల్ హాసన్ విచారణకు హాజరుకావాలని సీబీసీఐడీ సమన్లు జారీ చేసింది. కేంద్ర ఆర్ధిక నేరవిభాగం కార్యాలయంలో మంగళవారం జరిగే విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు.

 

ఈ ఘటనపై నజరత్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. షూటింగ్ స్పాట్ కు పోలీసులు వెళ్ళి పరిశీలన జరిపినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్ లను చూసి షాకయ్యారట. భారీ స్థాయిలో సెట్టింగ్ లు నిర్మించడానికి కార్పొరేషన్ - చెన్నై నగర పోలీసుల అనుమతి గాని - జిల్లా కలెక్టర్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు నిర్ధారించారు. ఈ నిర్ధారణతోనే కేసు విచారణను సీబీసీఐడీకి బదిలీ చేస్తూ గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 24న సెట్స్ నిర్మించిన కార్మికులు - క్రేన్ లను అద్దెకిచ్చినవారు సహా ఆరుగురిని వేర్వేరుగా విచారణ జరిపారు. ఇందులో భాగంగా ఇప్పుడు కమల్ హాసన్ ని పోలీసులు విచారించబోతున్నారు. అయితే ఈ ఘటన పై కమల్ హాసన్ పాజిటివ్ గా రెస్పాండ్ అవడం లేదని తెలిసి కొంతమంది ఆయన మీద మీకసలు బాధ్యత లేదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: