పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి సినిమా డిజాస్టర్ తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే ఆ గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు. రాజకీయాలలో సక్సస్ అవడానికి తీసుకున్నది. కానీ అక్కడ పవర్ స్టార్ కి జనం సపోర్ట్ చేయలేదు. దాంతో మళ్ళీ సినిమాలకోసం రెడీ అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో పవన్ తాజా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకి బాలీవుడ్ పింక్ సినిమా ఆధారం అన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకి ‘వకీల్ సాబ్’ అన్న టైటిల్ ను కన్‌ఫర్మ్ చేసి పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు.  

 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. పింక్ సినిమా కంప్లీట్ గా మెసేజ్ ఓరియంటెడ్ గా తెరకెక్కించారు. అయితే బాలీవుడ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. కానీ ఇక్కడ రూపొందిస్తున్న వకీల్ సాబ్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కమర్షియల్ హీరో కనుక ఇలా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కాస్త యారగెంట్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించాడని అర్థమవుతోంది.

 

అంతేకాదు ముఖ్యంగా లుక్ పరంగా క్యారెక్టర్ పరంగా బాలీవుడ్ లో తెరకెక్కించిన పింక్ సినిమాని అందులో నటించిన అమితాబ్ బచ్చన్ తో పవన్ ని పోల్చి చూస్తున్నారు. అయితే అక్కడ అమితాబ్ బచ్చన్ కి ఇక్కడ పవన్ కళ్యాణ్ కి చాలా వ్యత్యాసం కనిపిస్తుందని ఇంకా చెప్పాలంటే ఏ రకంగా కూడా ఇద్దరికి పోలికే లేదని అంటున్నారు. ఇక ఈ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఫస్ట్ లుక్ రివీలైందని ఆనందంతో పొంగిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: