ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు భారతదేశంలో తన ప్రభావం చూపించడం మొదలెట్టింది. రోజున అకస్మాత్తుగా మూడు కొత్త కేసులు నమోదు కావడంతో  దేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య ఆరుకి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో తొలి కరోనావైరస్ కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత అక్కడే మరో రెండు కేసులు నమోదు కాగా…. ముందు వైరస్ బారిన పడిన ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు.

 

తాజాగా ప్రకటించిన ఇద్దరు బాధితుల్లో దిల్లీకి చెందిన వ్యక్తి గతంలో ఇటలీ వెళ్లి రాగా, తెలంగాణకు చెందిన వ్యక్తి గతంలో దుబాయ్ వెళ్లి వచ్చారు. కొద్ది గంటల క్రితం జైపూర్ లో మూడవ కేసు నమోదు కాగా అతను ఏకంగా ఇటలీ దేశానికి చెందిన వాడు కావడం గమనార్హం. సందర్భంగా భారత్ లోని చాలా మంది అధికారులకు ప్రపంచ దేశాలపై అనుమానం వస్తోంది.

 

IHG

 

మరీ ముఖ్యంగా ఇటలీ పోయి వచ్చిన వ్యక్తితో పాటు ఏకంగా ఇటలీ నుండే మనిషి వచ్చ్గి ఇక్కడ వ్యాధిని వ్యాప్తి చేస్తుంటే ఇదేదో తేడా వ్య్వహారంలాగా ఉందని అంటున్నారుఇక దుబాయ్ కి పోయి వైరస్ బారిన పడిన హైదరాబాద్ వ్యక్తి విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 20 వరకు ఆయన దుబాయ్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశారు. అక్కడ హాంకాంగ్ వాసులతో కలసి పనిచేయడం వల్ల వ్యాధి సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

 

IHG

 

ఏదేమైనా భారత్ లో మిగతా దేశాలతో పోలిస్తే కరోనా ఎఫెక్ట్ అసలేం లేదు కానీ ఇప్పుడు ఉన్నట్టుంది పరిస్థితి మారిపోవడం నిజంగా ఆలోచించదగ్గ విషయం. అసలు వ్యాధి బారిన పడి ముగ్గురినీ సరిగ్గా విచారించి సోకిన తీరు కనుక్కుంటే ఏమైనా నిజాలు బయటపడే అవకాశం ఉంది. అయితే అధికారులు ఎయిర్ పోర్టు, సీ పోర్టులలో ఈ అనుమానంతో స్క్రీనింగ్ చేయిస్తున్నారే తప్ప ఈ విషయమై ఈ కోణంలో భాధితులను లేదా ప్రపంచ దేశాల ప్రభుత్వాలను ఇంకా ప్రశ్నించనేలేదు.

 

ప్రస్తుతానికి బాధితులు ముగ్గురూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: