16 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ పవిత్రా లోకేష్ శాండల్ వుడ్ లో దాదాపు అందరు స్టార్స్ తో నటించి మెప్పించింది. అందం అభినయం రెండు ఉన్న ఈ అమ్మడు మిస్టర్ అభిషేక్ సినిమాలో నటించింది. అదికూడా నటుడు అంబరీష్ సలహా మేరకే పవిత్రా లోకేష్ ఆ సినిమాలో నటించిందట. ఆ సినిమా హిట్ అవడంతో వెంటనే బంగారడ కలాష సినిమా ఆఫర్ అందుకుంది. తండ్రి లోకేష్ కన్నడ నటుడే కాగా పవిత్రా లోకేష్ నైంత్ క్లాస్ లో ఉన్నప్పుడే ఆయన మరణించడంతో ఫ్యామిలీ కష్టాల్లో పడ్డదట. తన తమ్ముడు ఆది లోకేష్ తో పాటుగా తల్లిని పవిత్రా లోకేష్ జాగ్రత్తగా చూసుకున్నారట. 

 

కుటుంబ భారమంతా తన మీదే పడటంతో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా సినిమా కావడంతో సినిమాల మీద ఆసక్తి చూపించారు పవిత్రా లోకేష్. సినిమాలు చేస్తున్నా సరే తన జీవితం ఒంటరి అనే భావనలోనే ఉండెదట పవిత్రా లోకేష్. అయితే కన్నడలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె అప్పట్లో వేరే భాషలో నటించడానికి ఆసక్తి చూపిచలేదు. 2003లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన దొంగోడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పవిత్రా లోకేష్. 

 

ఆ తర్వాత ఆలయం సినిమా చేసింది.. అయితే మళ్లీ కొన్నాళ్లు తెలుగు సినిమాలు చేయడం మానేసిన పవిత్రా లోకేష్ ప్రస్థానం సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా నుండి ఆమెకు వరుసగా తెలుగు సినిమా ఛాన్సులు వచ్చాయి. 2010 నుండి తెలుగులో సూపర్ ఫాం లో ఉన్నారు పవిత్ర లోకేష్. తెలుగులో 40కు పైగా సినిమాలు చేసిన పవిత్రా ఆంటీ తెలుగులో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నా కన్నడలో ఆమె ఒక హాట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: