తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేంత కీర్తిని మూటుగట్టుకున్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అలా ఎన్నో జ్ఞాపాలను వెండితెర మీద వదిలి వెళ్లిన నటి గీతాంజలి. తొలి సినిమానే ఎన్టీఆర్‌ లాంటి మహానటుడి సినిమాలో నటించి మెప్పించారు గీతాంజలి. ఎన్టీఆర్‌ తెరకెక్కించిన సీతారామ కళ్యాణం సినిమాతో సీతగా నటించటంతో ఆమెను అంతా ఎన్టీఆర్‌గారి సీత అనే పిలిచేవారట. అంతేకాదు రెండేళ్ల పాటు ఎన్టీఆర్‌ బ్యానర్‌లోనే నటించేలా ఒప్పందం చేసుకున్న గీతాంజలికి డైలాగ్స్‌, డ్యాన్స్‌, యాక్షన్‌ ఇలా అన్ని ఆయనే దగ్గరుండి మరీ నేర్చించారు.

 

సినిమా షూటింగ్‌లో ఉండగా గీతాంజలి క్యారియర్‌ కోసం అంతా ఎదురుచూసేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌, గీతాంజలి ఇంటి నుంచి క్యారియర్‌ తప్పకుండా స్పెషల్ ఉంటుంది అనేవారట. ఆమె ఇంటి నుంచి వచ్చే చేపల కూర, చికెన్‌ ఫ్రై, బిర్యానీ లను ఎన్టీఆర్‌ ఎంతో ఇష్టంగా తినేవారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో మెయిన్‌ హీరోయిన్‌ పాత్రలు చేసినా తరువాత నెమ్మది కామెడీ వైపు మళ్లారు గీతాంజతి. ప్రముఖ కమెడియన్‌ పద్మనాభం బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అలా ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించారు.

 

ఒక దశలో సినిమా ఏదైనా, హీరో హీరోయిన్లు ఎవరైనా కామెడీ జంట మాత్రం పద్మనాభం, గీతాంజలినే ఉండేవారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించారు గీతాంజలి. నటిగా కెరీర్‌ ఫుల్‌ బిజీగా ఉండగానే అప్పటి హీరో రామకృష్ణను పెళ్లి చేసుకున్నారు గీతాంజలి. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. అయితే సినీ రంగంతో అనుబంధాన్ని తెంచుకోలేక రామాపురంలో సీత అనే సినిమాను నిర్మించి నష్టపోయారు. పెళ్లి తరువాత చాలా కాలం సినిమాలకు దూరమైన గీతాంజలి తరువాత భామ్మ పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. నటి కొనసాగుతూనే తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: