టాలీవుడ్ లో ఎంత మంది అమ్మ పాత్రలు చేసినా సరే... అన్నపూర్ణమ్మ చేసిన అమ్మ పాత్రలు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతాయి అనేది వాస్తవ౦. టాలీవుడ్ లో అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె చేసిన అమ్మ పాత్రలు టాలీవుడ్ జనాలకు చూపించాయి. మోహన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు ఆమె అమ్మగా నటించి మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ కి కూడా అమ్మ పాత్రలో ఆమె నటించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఎంతగానో ఆకట్టుకునేది. 

 

ముఖ్యంగా టాలీవుడ్ జనాలకు అన్నపూర్ణమ్మ, నిర్మలమ్మ అనగానే అమ్మ పాత్రలే కళ్ళ ముందు ఉంటాయి. అంతకు ముందు ఎంత మంది వచ్చినా సరే వీళ్ళు చేసిన పాత్రలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పట్లో దర్శకులు కూడా అన్నపూర్ణమ్మ కోసం అంటూ ప్రత్యేకంగా అమ్మ పాత్రను డిజైన్ చేసారు. టాలీవుడ్ జనాలు కూడా ఆమెను ఆదరించారు. తమిళ సినిమాల్లో ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలకే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన పాత్రకు న్యాయం చెయ్యాలి అనే తపనతో ఆమె నటించే వారు.

 

తన పాత్రకు నటన ఎక్కువగా ఉంటేనే ఆమె సినిమాను అంగీకరించారు. వ్యక్తిగత జీవితంలో ఆమెకు పిల్లలు లేరు. అయినా సరే సినిమా కెరీర్ లో మాత్రం ఆమె చాలా మందికి అమ్మ అయింది. దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలు చేసింది. హీరోలు ఆమె కంటే పెద్ద వారు అయినా సరే ఆమె ఎక్కడా కూడా వెనక్కు తగ్గకుండా నటించేది. నిజంగా అమ్మేనా అనే విధంగా ఆమె నటించిన పాత్రలు అలా నిలిచిపోయాయి. ఈ మధ్య ఆమెకు వయసు ప్రభావంతో అమ్మ పాత్రలు తగ్గినా ఆమె మాత్రం తన ముద్ర వేసి వెళ్ళిపోయారు టాలీవుడ్ లో. కామెడి కూడా పండించే వారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: