ఎట్టకేలకు బాలకృష్ణ బోయపాటిల మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోని అరటి తోటలలో ఒక ఫైట్ సీన్ తీయడంతో మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ  జూనియర్ ఎన్టీఆర్‌ ను ఫాలో అవడం ఇప్పడు షాకింగ్ న్యూస్ గా మారింది.   గతంలో బి.గోపాల్ దర్శకత్వంలో జూనియర్ ‘నరసింహుడు’ అనే సినిమా చేసాడు. 

 

ఈ  మూవీలో జూనియర్ కు ఇంటర్వెల్ వరకు ఎలాంటి డైలాగులు ఉండవు. అదేవిధంగా బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమాలో ఎలాంటి డైలాగులు లేకుండా కొంతవరకు నటించ బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా ఫ్యాక్షనిస్ట్‌ గా రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్టు ఇప్పటికే లీకులు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలల జీవితంలో నవగ్రహాలు ఎలాంటి ప్రభావం చూపించింది అన్న పాయింట్ పై ఈ మూవీ కథ ఉంటుంది అని అంటున్నారు.   

 

అయితే బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర విషయంలో ఇంటర్వెల్ వరకు ఎలాంటి డైలాగులు ఉండవని లీకులు వస్తున్నాయి. ఆధ్యాత్మికత తో కూడిన ఈ అఘోర పాత్రలో బాలకృష్ణ నటన చాలా వైవిధ్యంగా ఉండే విధంగా మలచి నట్లు తెలుస్తోంది.   ఈ మూవీలో బాలయ్య ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని ‘స్వాతిలో ముత్యమంత’ పాటను తమన్‌ తో రీమిక్స్ చేయిస్తున్నట్టు కూడ వార్తలు వస్తున్నాయి.  

 

ఇది ఇలా ఉండగా  బాల‌కృష్ణ బోయ‌పాటి శ్రీ‌ను సినిమా కూడ రైతు స‌మ‌స్య మీద‌నే ఉంటుందని అంటున్నారు. ఈమూవీ తొలి స‌గం అనంత‌పురం నేప‌థ్యంలో సాగుతుందిని అక్క‌డ రైతుల స‌మ‌స్య‌ల‌ పై బాలయ్య పోరాటం చేస్తూ ఉంటే అక్కడ జిల్లా క‌లెక్ట‌ర్ పాత్రలో నటిస్తున్న బాలయ్యకు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంటుంది అని అంటున్నారు. ఈ మూవీ  సెకండాఫ్‌ లో క‌థ కాశీ కి షిఫ్ట్ అవుతుందిని ఆత‌రువాత సినిమా రేంజ్ పూర్తిగా మారిపోతుందని కేవలం  టేకాఫ్ కోసం రైతు పాయింట్‌ ని తీసుకున్నారు అని అంటున్నారు. ఏదిఏమైనా ఎన్నో అవాంతరాలు దాటి బాల్లయ్య బోయపాటిల మూవీ ప్రారంభం అయినందుకు అభిమానులు జోష్ లో ఉన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: