ఒక‌ప్పుడు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగి టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన హీరోయిన్లంతా కూడా అమ్మ పాత్ర‌లు పోషిస్తున్నారు. వీళ్ళ‌లో ముఖ్యంగా న‌దియా గురించి తీసుకుంటే... మోడ్ర‌న్ త‌ల్లుల‌లో న‌దియా ఒక‌ర‌ని చెప్పాలి. ఆమెది హీరోయిన్‌ని మించిన అందం. అంతే అభిన‌యంతో చ‌క్క‌టి పెర్‌ఫార్మెన్స్ ఇస్తూ మోడ్ర‌న్ త‌ల్లిగా స్థిర‌ప‌డిపోయింది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ నిర్మాత‌లంద‌రూ కూడా హీరోల‌కి కాని, హీరోయిన్ల‌కి కానీ త‌ల్లిగా.. అత్త‌గా న‌టించాలంటే ముందుగా చూసేది న‌దియా వైపే అన్న‌ట్లుగా మంచి పేరు తెచ్చుకుంది. వెండితెరపై మోడ్రన్ మదర్ గా చక్కగా ఒదిగిపోయిన ఈ  నటి నదియా. తమిళ మలయాల భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమె ..‘మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఊర్లో జరిగే గొడవులు, ఫ్యాక్షనిజం వంటి వాటికి దూరంగా కొడుకును పెంచే తీరు, పంచే అప్యాయత వంటివన్నీ మనసుకు బాగా హత్తుకుంటాయి. ఆ తర్వాత ‘అ..ఆ' చిత్రంలో కూతురే తన సర్వస్వంగా భావించే అమ్మ‌ పాత్ర‌లో న‌దియ అద్భుతమైన నటన కనబరిచింది. 

 

ఇక న‌దియ మోడ్ర‌న్ అమ్మ‌గానే కాక అత్తారింటికి దారేది చిత్రంలో అత్త‌గా కూడా మంచి ఎమోష‌న్ సీన్స్‌లో న‌టించి మెప్పించింది. త్రివిక్ర‌మ్ సృష్టించిన ఆ పాత్ర చూస్తే ఎవ‌రికైనా అత్త పాత్ర‌లో న‌టించాలనిపించేంత అందంగా తీర్చిదిద్దారు. మ‌రి అక్క‌డి నుంచి ద‌ర్శ‌కులు అమ్మ‌, అత్త పాత్ర‌ల‌ని కూడా చాలా స్ట్రాంగ్‌గా రాసుకోవాల‌ని డిసైడ్ అయ్యేంత‌లా  ఆపాత్ర ఉంటుంది. ఇక న‌దియా అమ్మ‌, అత్త పాత్ర‌లలో న‌టిస్తుంద‌న్న మాటేగాని హీరోయిన్ల గ్లామ‌ర్‌కి ఏమాత్రం తీసిపోదు. ఇక ఈమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఓ బిజినెస్ మ్యాన్ శిరీష్‌ని ఈమె వివాహం చేసుకుంది. ఆమెకి ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కుమార్తె అచ్చం న‌దియాలానే చాలా అందంగా ఉంటుంది. అయితే ఈమె హీరోయిన్‌గా ఎన్ని సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా పేరు మాత్రం రాలేదుగాని. త‌ల్లి, అత్త పాత్ర‌ల‌కు మాత్రం పెట్టింది పేరు అన్న‌ట్లు ఆ పాత్ర‌ల‌కు మాత్రం ఓ మోడ్ర‌న్‌త‌ల్లిగా..మోడ్ర‌న్ అత్త‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేసింద‌నే చెప్పాలి. అయితే మోడ్ర‌న్ త‌ల్లిగా న‌దియా ద‌ర్శ‌కుల‌కు డిమాండ్స్ కూడా కాస్త బాగానే పెట్టుద్ద‌ని స‌మాచారం. మ‌రి అది ఎంత వ‌ర‌కూ నిజ‌మోగాని ఈమె డిమాండ్స్ కాస్త ఎక్కువేన‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: