బాబూ చిట్టీ... ఎవరిని అయినా ట్రోల్ చెయ్యాలన్నా, ఎవరిని అయినా విమర్శించాలి అన్నా, ఎవరిని అయినా కామెడీగా చూపించాలి అన్నా... బాబూ చిట్టీ అంటూ ఒక హావభావ౦తో చిన్న క్లిప్ కనపడుతుంది. ఆ క్లిప్ చాలా మంది కామెడిగానే చూస్తారు గాని ఆ క్లిప్ లో కనపడిన శ్రీ లక్ష్మి గురించి చాలా మందికి తెలియదు. బాబూ చిట్టీ అంటూ ఆమె పిలిచిన పిలుపు ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కువగా వినపడుతుంది. టాలీవుడ్ లో అలాంటి కామెడి పాత్రలు ఆమె ఎన్నో చేసి మెప్పించారు. 

 

ఆ పాత్రలు ఆమె మినహా ఎవరు చేసినా సరే ఆ పాత్రలకు ఒక అందం వచ్చేది కాదు. కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన నివురుగప్పిన నిప్పులో మొదటిసారి కమెడియన్ గా (నగేష్ పక్కన) చేశారు. సినిమా విజయం సాధించలేదుకానీ, శ్రీలక్ష్మి పాత్ర సూపర్‌ హిట్టయ్యింది. తర్వాత జంధ్యాల గారి రెండుజెళ్ళ సీతలో చిన్న అవకాశం దొరికింది. ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ శ్రీలక్ష్మిగారి టాలెంట్‌ని గుర్తించి, క్యారెక్టర్ని పొడిగించారు. ఆతర్వాత జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించారు. రెండు జెళ్ళ సీత సినిమాలో చేసిన హాస్యపాత్రకు గాను ఆమెకు ఉత్తమ హాస్యనటిగా కళాసాగర్ అవార్డు లభించింది. 

 

ఆమె హాస్య నటిగా అక్కడి నుంచి 13 ఏళ్ళ పాటు ఉత్తమ హాస్య నటిగా అవార్డులు పొందారు. ఆమె చేసిన ఎన్నో సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బాబాయి అబ్బాయి (1984), శ్రీవారికి ప్రేమలేఖ (1984), మంత్రిగారి వియ్యంకుడు (1983), పుత్తడి బొమ్మ (1983), రెండుజెళ్ళ సీత (1983), శ్రీమాన్ శ్రీమతి (1982), వందేమాతరం (1982), నాలుగు స్తంభాలాట (1982) ఇలా ఆమె చేసిన సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆమెకు. ఆమెకు ముందు హీరోయిన్ గా అవకాశం వచ్చినా సరే హాస్య నటిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రల్లో ఆమె జీవించారు. బ్రహ్మంధం, సుత్తివేలు పక్కన ఆమె నటించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: