సాధారణంగా సినిమాల్లో దేవుడు పాత్రలకు పురుషులు ఎక్కువగా నటిస్తూ ఉంటారు. మహిళలు ఆ పాత్రలు చెయ్యాలి అంటే మాత్రం ధైర్యం కావాలి. కాని కేఆర్ విజయ మాత్రం ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆ పాత్రల్లో నటించి మెప్పించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ఆమె చేయని పాత్రలు అంటూ ఏమీ లేవు. ఎప్పుడో 1960 లలోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అక్కడి నుంచి మంచి డాన్సర్ గా కూడా విజయ గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. 

 

మద్రాసులో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు.గ్లామర్ తో పాటు నటనలో కూడా ఆమె అలరించారు. చిరంజీవి, ఎన్టీఆర్ కి, శోభన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ కి ఇలా చాలా మందికి ఆమె తల్లిగా నటించి మెప్పించారు. కేరెక్టర్ పాత్రల్లో కూడా ఆమె నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె నవ్వు చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఆమె నటించింది అంటే కచ్చితంగా దర్శకులు ఆమె నవ్వునే ఎక్కువగా హైలెట్ చేసేవారు. 

 

దర్శకులు కూడా కేఆర్ విజయ నవ్వు గుర్తించి ఇంటర్వ్యులలో కూడా ప్రస్తావించారు. అగ్ర హీరోల పక్కన ఆమె చేసిన పాత్రలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అన్న-తమ్ముడు (1990), ఇద్దరూ ఇద్దరే (1990), సూత్రధారులు (1990), జగన్మాత (1987) సినిమాలో పార్వతిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశ్వనాధ నాయకుడు (1987), శ్రీదత్త దర్శనం (1985) సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాలో ఆమె నటన, ఆ సినిమాలో బాలకృష్ణ కు నానమ్మ గా ఆమె చేసిన పాత్ర అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: