ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమా ఇండస్ట్రీ కళకళ లాడుతుంది.  ఇప్పుడు వస్తున్నది మార్చి నెల.  అంటే పరీక్షల కాలం.  ఈనెల మొత్తం పరీక్షలు జరగబోతున్నాయి.  ఇంటర్, పదోతరగతి పరీక్షలు ఉన్నాయి.  ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో పురపాలక, పంచాయితీ రాజ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.  ఇలా ఒకదాని తరువాత ఒకటి ఉండటం సినిమా ఇండస్ట్రీపై కొంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉన్నది.  అందులో సందేహం అవసరం లేదు.  


సినిమా ఇండస్ట్రీలోపరీక్షలు కొంతవరకు ప్రభావం చూపించవచ్చు.  ఎందుకంటే, సినిమాలకు వెళ్ళాలి అనుకున్న పిల్లలు కావొచ్చు, తల్లిదండ్రులు కావొచ్చు పిల్లల పరీక్షలు ఉంటాయి కాబట్టి వాటిని పక్కన పెట్టేస్తుంటారు.  పిల్లలు ఫ్యామిలిలు థియేటర్లకు రాకుంటే చాలా వరకు ఇబ్బందులు వస్తాయి.  అందుకే పెద్ద సినిమాలు ఏవి కూడా ఏప్రిల్ నెల వరకు రిలీజ్ కాకుండా ఉంటాయి.  


మార్చి నెలలో చిన్నా చితకా సినిమాలు రిలీజ్ అవుతుండటం తెలిసిందే. ఈ మార్చి నెలలో కూడా అటువంటి సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని మీడియం సినిమాలు కూడా ఉండటం విశేషం.  పలాస సినిమా ఈనెలలోనే రిలీజ్ అవుతున్నది.  నాగ్ అశ్విన్ హీరోగా చేసిన సినిమా ఇది.  అదే విధంగా ఉగాది సందర్భంగా నాని వి, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాలు, మార్చి 26 న మోహన్ లాల్ సినిమా రిలీజ్ అవుతుంది.  


ఇలా వరసగా సినిమాలు ఉన్నాయి.  పరీక్షల ఎఫెక్ట్ ఉన్నప్పటికీ తప్పదు కదా అందుకే మార్చి నెలలో సినిమా రిలీజ్ చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, దీనికి తోడుగా ఇండియాలో కరోనాఎంటర్ అయ్యింది.  ఈ కరోనా వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. హైదరాబాద్ లో తొలికేసు నమోదు అయ్యింది.  కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూడాలి.  హైదరాబాద్ వాతావరణంలో వైరస్ బతకడం కష్టం కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: