టాలీవుడ్ లో అజ్ఞాతవాస తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్లీ తెరపై కనిపిస్తున్నాడు పవన్ కళ్యాన్.   వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ   ఫస్ట్ లుక్ ఈ సాయంత్రం 5 గంటలకు విడుదల అయింది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ‘వకీల్ సాబ్’ టైటిల్ నే ఫిక్స్ చేశారు.  అభిమానులు అంచనాలను ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందుకుని సినిమా పై ఆసక్తిని మరింతగా పెంచింది.  ఈ మద్య ఫస్ట్ లుక్ తోనే సినిమా అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ ఫస్ట్ లుక్ పై సెలబ్రెటీలు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.

 

ఇది ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచేలా ఉంది.   చాలా కాలం వెయిటింగ్.. వకీల్ సాబ్ వచ్చాడు.. అంటూ తెగ పొగిడేస్తున్నారు.  ఇక టాలీవుడ్ సంచల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలాంటి విషయంలో ఓ అడుగు ముందే ఉంటారు.  ముఖ్యంగా పవన్ విషయంలో ఆయన ఏ రేంజ్ లో సెటైర్స్ వేస్తారో అందరికీ తెలిసిందే. నిన్న పవన్ కళ్యాన్ ఫస్ట్ లుక్ వకీల్ సాబ్ పై తనదైన సెటైర్లు వేశారు.

 

పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఉన్న విధంగానే వర్మ కూడా అలాగే కూర్చొని ఆ పోస్టర్ పై డైరెక్టర్ సాబ్ అని టైటిల్ వేసుకున్నాడు. ఆ పోస్టర్ ను చుసిన తరువాత పవర్ స్టార్ ఫాన్స్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు వార్నింగ్ లు ఇస్తుంటే ఇంకొంత మంది మాత్రం నవ్వుకుంటున్నారు. వర్మ ఎవరిని వదలడు... దేనిని వదలడు అని ఇంకొంత మంది నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: