టాలీవుడ్ లో జయం సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టిన నితిన్ ఇప్పటి వరకు హీరోగా పెద్దగా విజయాలు సాధించకున్న హీరోగా ఎక్కడా డ్యామేజ్ కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  అ..ఆ తర్వాత నితిన్ కి ఏ ఒక్క సినిమా కలిసి రాలేదు.  ఈ మద్య వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ‘భీష్మ’ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. 

 

ఈ సినిమాకు మొదటి నుండి పాజిటివ్ టాక్ రాగా క్రిటిక్స్ కూడా ఈ మూవీ హిట్ అని తేల్చేసారు. దాంతో భీష్మ మొదటి రోజు కలెక్షన్స్ ను కుమ్మేసింది. నితిన్ కెరీర్ లోనే బెస్ట్ గా దాదాపు 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.  ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను, రసాయనాలు వాడడం వల్ల కలిగే నష్టాన్ని ఈ మూవీలో కమర్షియల్ పద్దతిలో చూపించారు.

 

ముఖ్యంగా డైలాగులు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. భీష్మ పాత్రలో నితిన్ నటన, కామెడీ టైమింగ్ అద్భుతమనే లెవెల్లోనే ఉంది. ఈ మద్య రైతు సమస్యలపై వస్తున్న సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మద్య చిరు నటించిన ఖైదీ నెంబర్ 150, మహేష్ బాబు నటించిన మహర్షి మంచి విజయాలు అందుకున్నాయి. 10 రోజులకు గాను ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల వసూళ్లను మించి సాధించింది. భీష్మకు 26 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగ్గా ఇప్పుడు దాన్ని క్రాస్ చేసింది. 

 

భీష్మ 10 డేస్ కలెక్షన్స్ :
నైజాం: రూ. 8.57 కోట్లు
సీడెడ్: రూ. 3.13 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.86 కోట్లు
ఈస్ట్: రూ. 1.64కోట్లు
వెస్ట్: రూ. 1.21 కోట్లు
గుంటూరు: రూ.  1.73 కోట్లు
కృష్ణ: రూ. 1.44 కోట్లు
నెల్లూరు: రూ. 72 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ:  రూ. 21.30 కోట్లు షేర్స్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 1.88 కోట్లు
ఓవర్సీస్: రూ. 3.10కోట్లు
వరల్డ్ వైడ్: రూ. 26.28 కోట్లు షేర్స్

మరింత సమాచారం తెలుసుకోండి: