టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్టుల్లో సత్య కృష్ణన్ ఒకరు. శేఖర్ కమ్ముల పరిచయం చేసిన ఈమె ఆ తర్వాత కూడా తన ఫాం కొనసాగించారు. అక్క, చెల్లి, వదిన ఇలాంటి పాత్రల్లో సత్య కృష్ణన్ అలరించారు. హోటల్ మేనేజ్మెంట్ చేసిన సత్య కృష్ణన్ తాజ్ కృష్ణలో జాబ్ చేస్తున్న టైం లో శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాలో వదిన పాత్రలో నటించింది. తనకు ఇచ్చిన పాత్రలో మెప్పించే సత్య కృష్ణన్ హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు చేసింది.  

 

2004 నుండి ఇప్పటివరకు దాదాపుగా 50కి పైగా సినిమాలు చేసిన సత్య కృష్ణన్ పోసాని కృష్ణ మురళి చేసిన మెంటల్ కృష్ణ సినిమాలో ఆయన భార్యగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో కూడా నటించిన సత్య కృష్ణన్ తాజ్ గ్రూప్ లో మాత్రమే కాదు ఆ తర్వాత బి.ఎన్.బి పరిబాస్ బ్యాంక్ లో కూడా పనిచేశారు. అనుకోకుండా అవకాశాలు రావడంతో ముందు అయిష్టంగానే సినిమాలు చేసిన సత్య కృష్ణన్ ఆ తర్వాత పూర్తిస్థాయిలో సినిమాలు చేస్తూ వచ్చారు.

 

తెలుగు సినిమా ఫ్యామిలీ అనగానే అక్క చెల్లి వదిల్న ఇలా ఏదో ఒక పాత్రలో సత్య కృష్ణన్ కనబడుతుంది. తనదైన శైలిలో సహజ నటనతో మాత్రమే కాదు డైలాగ్ డెలివరీతో ఆమె ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈమధ్య ఛాన్సులు తగ్గినట్టు అనిపించగా మళ్లీ ఆమె ఫాం లోకి రావాలని ఆశిస్తుంది. యువ హీరోల సినిమాల నుండి స్టార్స్ వరకు సత్య కృష్ణన్ పాత్ర ఉండాల్సిందే. మరి రానున్న రోజుల్లో సత్య కృష్ణన్ ఇలానే మంచి సినిమాలు చేయాలని ఆశిద్దాం. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: