ప్రస్తుత జనరేషన్‌ హీరోయిన్లు కెరీర్‌ గాలి బుడగ లాంటింది. ఎన్నాళ్లు వెండితెర మీద కనిపిస్తారో ఎవరూ చెప్పలేరు. కానీ సీనియర్ల పరిస్థితి అలా కాదు. గతంలో హీరోయిన్లు దశాబ్దాల పాటు తమ హవా చూపించేవారు. అంతేకాదు నటిగానూ తమ మార్క్‌ చూపించేందుకు ప్రయత్నించేవారు. అలా వెండితెర మీద సత్తా చాటిన మహా నటీ మణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అద్భుతమైన నటే ఊర్మశీ శారద. హీరోయిన్‌గా గ్లామర్‌ రొల్స్‌ చేసిన ఈము తరువాత లేడీ ఒరియంటెడ్‌ సినిమాలతోనూ ఆకట్టుకున్నారు.


తెలుగు తెరపై కథానాయికగా శారద స్థానం ప్రత్యేకం. ఈ పాత్రను శారద మాత్రమే చేయగలరు అనుకునే అనేక పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించి మెప్పించారు. అలాంటి శారద గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. శారదలో మంచి నటి ఉందనే విషయాన్ని ముందుగా మలయాళ చిత్ర దర్శక నిర్మాతలు గుర్తించారు. మలయాళంలో ఆమె చేసిన 'తులాభారం' సినిమా ఆమెకి 'ఊర్వశి' అవార్డును తెచ్చిపెట్టింది.

 

ఇదే సినిమాను తెలుగులో 'మనుషులు మారాలి' టైటిల్ తో తీయాలనుకున్నప్పుడు, ఆ స్థాయిలో మరొకరు మెప్పించడం కష్టమేనని భావించిన దర్శక నిర్మాతలు శారదనే ఎంపిక చేసుకున్నారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆ దర్శక నిర్మాతలు కూడా ఆమెనే కరెక్ట్ అని భావించి తీసుకున్నారు.

 

ఇక ఇదే సినిమాను హిందీలో 'సమాజ్ కో బదల్ డాలో'గా రూపొందించారు. వాళ్లు కూడా శారద మినహా మరెవరూ చేసినా ఆ పాత్ర తేలిపోతుందని భావించి ఆమెనే ఎంపిక చేసుకున్నారు. ఇలా ఒకే పాత్రను నాలుగు భాషల్లో శారద చేయడం .. ఆ నాలుగు భాషల్లోను ఆ సినిమా సూపర్‌ హిట్ కావడం విశేషం. ఇలా ఒక సినిమాను నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తే నాలుగు భాషల్లోనూ ఒక నటి నటిచటం అనే అరుదైన క్రెడిట్ శారదకు మాత్రమే దక్కింది

మరింత సమాచారం తెలుసుకోండి: