ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు తల్లి పాత్రలు గా నటించేందుకు చాలా తక్కువ మంది నటులు ఉన్నారు అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు హీరో తల్లి పాత్రలు అంటే కేవలం నటన లో నైపుణ్యం ఉంటే చాలు అనుకునే వారు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు ఆలోచనా తీరు మారింది. ప్రస్తుతం హీరోయిన్లు ఎంత అందంగా ఉండాలి అని అనుకుంటున్నారో. హీరోలకు తల్లి పాత్రల్లో నటించే వారు కూడా అందంగానే ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకే ఇలా తల్లి పాత్రల కోసం ఉన్న నటులు కొంత మంది ఉన్నారు. ఇలా తల్లి పాత్రల కోసం ఉన్న కొంత మంది నటుల్లో ముందుగా వినిపించే పేరు ప్రగతి. 

 

 ప్రగతి వయస్సు చాలా తక్కువే అయినప్పటికీ.. ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన  ప్రగతి ఇక ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరో హీరోయిన్ల తల్లి పాత్రలు అత్త పాత్రలు చేసుకుంటూ పేరు నడిపిస్తోంది. అయితే కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు తల్లి పాత్రలకు కూడా ఇండస్ట్రీలో పలు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రగతి అని చెబుతోంది. అయితే ఈమె పేరు ప్రగతి అయినప్పటికీ.. తల్లి పాత్రలు చేయటంతో... ప్రగతి ఆంటీ అని పిలుస్తారు. 

 

 

ప్రగతి ఆంటీ కి ఓ సినిమాలో తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందట. ఆ తర్వాత హీరో ఎవరో తెలియకుండానే సినిమాకు ఓకే చేసిందట. ఇక ఆ తర్వాత సెట్స్ వెళ్లక.. హీరో ఎవరో అర్ధం కాలేదట. ఇక హీరో ఎవరు అని అక్కడ అడిగే సరికి ఓ వ్యక్తి నేనే అని చెప్పాడట. దీంతో ఆమెకి ఏం అర్థకాక పక్కకి వెళ్లి ఎంతగానో ఏడ్చిందట. ఇక అప్పటి నుండి ఏ సినిమా చేస్తున్న కూడా హీరో ఎవరు.. హస్బెండ్ పాత్ర ఎవరు.. అని అన్ని తెలుకున్నాకే సినిమా ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పింది. అయితే తాను హీరో గురుంచి తెలిసి ఏడ్చినా సినిమా ఏది...హీరో ఎవరు  అన్నది మాత్రం చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: