తెలుగులో మాస్ సినిమాలు తీసే దర్శకులు చాలా మందే ఉన్నారు. వారందరిలో ప్రముఖంగా వినిపించే పేరు పూరి జగన్నాథ్. ఆ ప్రముఖ దర్శకుడి దగ్గర శిష్యరికం చేసి తాను కూడా మాస్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అని నిరూపించుకున్న దర్శకుడు హరీష్ శంకర్. తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు హరీష్ చేసినవన్నీ మాస్ చిత్రాలే. పవన్ కళ్యాణ్ తో తీసిన  గబ్బర్ సింగ్ చిత్రం నుండి తాను కూడా టాప్ దర్శకుడిగా మారిపోయాడు. 

 

 

అయితే హరీష్ శంకర్ ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేస్తాడన్న పేరుంది. అయితే హరీష్ తీసే రీమేక్ చిత్రాలకి మిగతా డైరెక్టర్లు తీసే రీమేక్ లకి చాలా తేడా ఉంటుంది. హరీష్ రీమేక్ చేసిన కథకి, ఒరిజినల్ కథకి చాలా తేడా ఉంటుంది. కేవలం కథాంశాన్ని మాత్రమే తీసుకుని అందులో మన నేటివిటీకి తగినట్టుగా పాత్రల్ని, పాత్ర నడవడికని మార్చేసి ప్రేక్షకులకి అందిస్తాడు. అందుకే హరీష్ శంకర్ రీమేక్ లకి అంత స్పెషాలిటీ ఉంటుంది.

 

 

రీమేక్ లని ఒరిజినల్ అన్న లెవెల్ లో సినిమాలు తీసే ఈ దర్శకుడు చిరంజీవి సొంతం చేసుకున్న లూసిఫర్ కథని తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది. అంతకుముందు సుకుమార్, వంశీ పైడిపల్లి పేర్లు వినిపించినా కూడా హరీష్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ సడెన్ గా వినాయక్ పేరు తెర మీదకి రావడంతో హరీష్ శంకర్సినిమా చేయట్లేదని తెలుస్తుంది.

 

 

అదీ గాక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా కోసం స్క్రిప్టు పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందువల్ల  హరీష్ ని పక్కన పెట్టి వినాయక్ ని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు ఈ సినిమాని ఎవరు తెరకెక్కిస్తున్నారో..!

మరింత సమాచారం తెలుసుకోండి: