వాణిశ్రీ తెలుగు సినిమాతో ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఈ పేరు తెలియ‌కుండా ఉండ‌దు. నెల్లూరులో పుట్టి చ‌న్నైలో చేరి సినీ వినీలాకాశంలో వెలిగిన తార ఆమె. నేటికీ ఎంద‌రో ప్రేక్ష‌కుల అపురూప జ్ఞాప‌కం. అప్ప‌ట్లో వృద్ధుల్ని, యువ‌ల్ని సైతం ఆక‌ర్షించిన అందం ఆమె సొంతం. అప్ప‌ట్లో వాణిశ్రీ‌కొప్పు, వాణిశ్రీ చీర‌క‌ట్టు, వాణిశ్రీ న‌క్సెస్ అంటూ ఇలా ఎన్నోఫ్యాష‌న్ల‌కు ఆమె ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. వాణిశ్రీ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో విష‌యాలు విని ఉంటారు. వాణిశ్రీ అస‌లు పేరు ర‌త్న‌కుమారి. సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో ఎస్వీఆర్ ఆమె పేరు మార్చ‌డంతో వాణిశ్రీ‌గా చ‌లామ‌ణి అయింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభ‌న్‌బాబు స‌హా అప్ప‌టి క‌థానాయ‌కులంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. తన న‌ట‌న‌తో ఒక్కోసారి హీరోల‌ను కూడా డామినేట్ చేసింది. 

 

సుఖ దఃఖాలు చిత్రంలో చెల్లెలి పాత్ర‌లో న‌టించి అభిన‌య‌శ్రీ వాణిశ్రీ అన్న పేరు తెచ్చుకుంది. సావిత్రి త‌ర్వాత అంత స్థాయి న‌టిగా పేరు పొందింది. ఇత‌ర హీరోయిన్లు లాగా విగ్ పెట్టుకోవ‌డం ఆమెకు అసలు నచ్చ‌దు. ఆమెది చాలా పెద్ద జుట్టు. స‌తీసావిత్రి చిత్రంలో ఆమె ఒరిజిన‌ల్ హెయిర్‌ని చూడొచ్చు. అయితే ఈమెకు ఇప్ప‌టి త‌రం హీరోయిన్ల‌లో అనుష్క అంటే బాగా ఇష్ట‌మ‌ట‌. మొత్తం ఇండ‌స్ట్రీలోనే వాణిశ్రీ త‌న‌ను తాను అదృష్ట‌వంతురాలిగా అలాగే ఎక్కువ డ‌బ్బు సంపాదించిన వారిగా అనుకుంటారు. ఇక కెరియ‌ర్‌లో త‌న న‌ట‌న‌ను మెచ్చుకున్న‌వారు ఇద్ద‌రే ఇద్ద‌ర‌ట‌. వారే ఒక‌రు ఎన్టీఆర్‌, మ‌రొక‌రు కృష్ణంరాజు. 

 

సినిమాల్లో ఎక్కువ‌గా నేను ఆత్మాభిమానం ఉన్న క్యారెక్టర్స్‌లో చేశాను కాబ‌ట్టే నిజ జీవితంలో కూడా నిప్పులా ఉండేదాన్ని అని ఆమె ప‌లు సంద‌ర్భాల్లో తెలిపారు. ఏవో కార‌ణాల వ‌ల్ల సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో దాదాపు 30ఏళ్ళ పాటు మాటలు లేవ‌ట‌. మేక‌ప్‌వ‌ల్లే ఆమె ఫేమ‌స్ కాబ‌ట్టి దానికోసం ఏకంగా ఆమె మూడు గంట‌లు కేటాయించేద‌ట‌. షూటింగ్ నుంచి ఇంటికి వ‌చ్చాక మేక‌ప్ అంతా పోవ‌డానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసేవార‌ట‌. అలాగే ఎవ‌రెన్ని చెప్పినా కూడా వాణిశ్రీ‌మాత్రం ఉద‌యం తొమ్మిది త‌ర్వాతే షూటింగ్ స్పాట్‌కి వ‌చ్చేద‌ట‌. అప్ప‌ట్లో ఓ క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రాంలో వాణిశ్రీ‌ని చూసిన నాగ‌య్య ఈ అమ్మాయి అచ్చం సావిత్రిలా ఉందంటూ ప్ర‌శంసించారు. వాణిశ్రీ మొద‌ట్లో హీరోయిన్‌గా చేసినా త‌ర్వాత త‌ర్వాత చాలా సినిమాల్లో అమ్మ‌, అత్త పాత్ర‌ల్లో చాలా అద్భుతంగా న‌టించారు. అయితే ఆమె ఏ పాత్ర‌లో న‌టించినా కూడా ఆమె పొగ‌రుగా ఉన్న పాత్ర‌ల్లో ఎక్కువ న‌టించేవారు. దానికి క‌రెక్ట్‌గా సూట్ అయ్యేవారు కూడా. ఆవిడా మా ఆవిడే చిత్రంలో సోభ‌న్‌బాబుకు ఒక భార్య‌గా న‌టించిన పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: