ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో  బాగా ఫేమస్ అయిన ఆర్టిస్ట్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రగతి. నఎన్నో  తల్లి పాత్రలో ఎన్నో అత్త పాత్రల్లో ఇలా హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. మొదట హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రగతి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా  నటించినప్పటికీ ఆ తర్వాత అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో వయసు తక్కువే అయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తింది ప్రగతి. ఇక హీరోలకు తల్లి పాత్రలు చేస్తూ ఉండడంతో ప్రగతిని    ప్రగతి ఆంటీ గా పిలవడం మొదలుపెట్టారు. 

 

 

 అయితే ఇప్పటికే ఎన్నో స్టార్ హీరోల సినిమాల్లో తల్లి పాత్రలో పాత్రల్లో నటించి తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు కీలక పాత్రల్లో నటించి... ప్రత్యేక గుర్తింపు సంపాదించింది ప్రగతి ఆంటీ. అయితే ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్లకే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని చెబుతోంది ప్రగతి ఏంటి. ఓ సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇంటర్వ్యూలో తెలిపింది. తను ఓ తమిళ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని. కానీ ఆ తర్వాత ఆ సినిమాకు ఎందుకు ఒప్పుకున్నాను అనేలా ఓ అనుభవం ఎదురైంది అంటూ ప్రగతి ఆంటీ తెలిపింది. 

 

 

 తమిళ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో... తమిళ హీరోతో తనతో మిస్ బిహేవ్ చేసాడు అంటూ ప్రగతి ఆంటీ  చెప్పుకొచ్చింది. అయితే తనతో మిస్ బిహేవ్ చేయడంతో పాటు... తాను చెప్పినట్టుగానే నడుచుకోవాలి అంటూ తనను ఎంతో ఇబ్బందికి గురి చేసాడు  అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతే కాకుండా చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి అంటూ ప్రగతి ఆంటీ కి చెప్పాడట ఆ హీరో. దీంతో చిర్రెత్తిన ప్రగతి ఆంటీ... నువ్వేమైనా రజనీకాంత్ కమల్ హాసన్ అనుకుంటున్నావా ఇంతలా రూల్ చేసి మరీ ఎక్కువ చేస్తున్నావ్... అటు వార్నింగ్ ఇచ్చిందట. ఈ సినిమా చేయడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పేసి సెట్స్  నుంచి వచ్చేసిందట. ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ప్రగతి ఆంటీ పేరు చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: