పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా రంగంలో బిజీ అయ్యాడు.  26 వ సినిమా వకీల్ సాబ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.  లుక్ రిలీజ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.  తమ అభిమాన హీరోను మళ్ళీ తెరపై చూసుకోలేమేమో అనుకున్న ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ తొందరగానే సినిమా అందిస్తున్నాడు.  మే నెలలో సినిమా రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటె ఇందులో పవన్ లాయర్ గా కనిపిస్తున్నారు.  


రీమేక్ సినిమా కాబట్టి మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది.  పైగా పింక్  బాలీవుడ్ లో సూపర్ హిట్.  అటు కోలీవుడ్ లో కూడా సినిమాను అజిత్ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.  ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు.  ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.  సినిమా పరంగా పవన్ మంచి మార్కులు కొట్టేశాడు.  సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అందులో సక్సెస్ అయ్యాడు.  


వకీల్ సాబ్ తో పాటుగా పవన్ కళ్యాణ్ 27 వ సినిమా కూడా చేస్తున్నారు.  ఇది కూడా వకీల్ సాబ్ తో పాటుగా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు.  ఈ మూవీ అనంతరం మరో మూవీ కూడా పవన్ ప్లాన్ చేసుకున్నారు.  గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్  అందించిన హరీష్ శంకర్ తో ఈ సినిమా ఉండబోతున్నది.  ఈ మూవీ కూడా త్వరలోనే లాంచ్ అవుతుంది.  అంతేకాదు, 29 వ సినిమా, 30 వ సినిమా కూడా పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  


సినిమాల్లోకి రానని చెప్పిన పవన్ సినిమా రంగంలోకి వెళ్ళడానికి కారణం ఉన్నది.  సినిమా నుంచి వచ్చే డబ్బులతోనే రాజకీయాలు చేస్తున్నట్టు చెప్పారు.  సినిమా లేకపోతె ఆదాయం లేదని, ఆదాయం ఉంటేనే రాజకీయాలు చేయగలనని పేర్కొన్న సంగతి తెలిసిందే.  అదే విధంగా జగన్  తాను రాజకీయాలు వదిలేసి సినిమా రంగంలో సెటిల్ అవుతానని అన్నారు.  మొన్నటి  రోజున జగన్ ను పవన్ మెచ్చుకున్నారు.  అంటే అర్ధం ఏంటి? నిజంగానే పవన్ అలా చేస్తారా? 

మరింత సమాచారం తెలుసుకోండి: