బామ్మ పాత్రలో నటించాలంటే నిర్మలమ్మ తర్వాతే ఎవరైనా. ఎన్నో పాత్రలో నటించారు  నిర్మలమ్మ. సహజ నటిగా కూడా ఈమె ప్రసిద్ధి చెందారు. ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఈమె అసలు పేరు రాజమణి. స్నేహం కోసం, మాయలోడులో మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణ జిల్లా బందరు ఈమె స్వస్థలం. ఎందరో మంది సీనియర్ తారలతో నటించింది. పదహారు ఏళ్ళ వయసులోనే ఈమె సినిమాలోకి రావడం జరిగింది.

 

IHG

 

ఆమె పదహారవ ఏట గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో నటించారు. ఆమె బామ్మ పాత్ర చేసి అందర్నీ మెప్పిస్తారు. వయసులో తన కంటే పెద్ద వారైనా హీరోలకి తల్లిగా నటించారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు వంటి హీరోలకి బామ్మగా ఈమె నటించడం జరిగింది. 

 

మనుషులు మారాలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది నిర్మలమ్మ. ఈ సినిమా ప్రోగ్రాంలో హిందీ నటుడు ప్రాణ్ నిర్మలమ్మని ఆమె భారత్ కి మా! అని అన్నాడు.  కానీ ఆమె హిందీలో మాట్లాడలేకపోయింది అని విచారించింది నిర్మలమ్మ. ఏకవీర నాటకంలో గిరిక పాత్ర వేసిన నిర్మలమ్మని చూసి కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.

 

 

స్నేహం కోసం, మావిచిగురు, రాయడు, బిగ్ బాస్, శుభ సంకల్పం, అలీబాబా అరడజను దొంగలు, సుందరకాండ, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, ముచ్చటగా ముగ్గురు, రుస్తుం, మయూరి, మహానగరంలో మాయగాడు, సంఘర్షణ, మెగా మహారాజు, అగ్నిపూలు, శంకరాభరణం, శివరంజని, దేవత, అర్ధరాత్రి ఇలా ఎన్నో సినిమాలో నటించింది నిర్మలమ్మ. కాకినాడలో కరువు రోజులు నాటకం చూసిన పృథ్వి రాజ్ కపూర్ గొప్ప నాటివవుతావు అని చెప్పాడట. అనేక సార్లు ఆమె తలచుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: