తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ చిన్న పాత్ర వచ్చినా సరే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాని ఒక వెలుగు వెలిగి కనుమరుగు అయిపోయిన వాళ్ళ బాధ మాత్రం చెప్పలేనిది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిపోయిన వాళ్ళ సంఖ్య చాలానే ఉంటుంది. అందులో సురేఖా వాణీ అనే నటి ఒకరు. టాలీవుడ్ లో అమ్మ పాత్రలు, అత్త పాత్రలు ఇలా చాలానే చేసారు ఆమె. మరి ఏమైందో ఏమో ఉన్నపళంగా కనుమరుగు అయిపోయారు. 

 

ఇప్పుడు అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల పక్కన సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు ఒక్క అవకాశం వచ్చినా సరే అదే పదివేలు అనుకునే పరిస్థితి. టిక్ టాక్, సోషల్ మీడియా లాంటి సామాజిక మాధ్యమాల్లో ఆమె హడావుడి ఎక్కువగానే ఉంది. అయినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఆమె ఎందుకు అలా ఒక్కసారే సినిమాలకు దూరం అయింది అనేది ఎవరికి తెలియకపోయినా తనకు ఉన్న డిమాండ్ చూసి ఆమె పారితోషకం పెంచడమే ప్రధాన కారణం అంటున్నారు కొందరు. 

 

చాలా వరకు ఆమె కోటి రూపాయలకు పైగానే డిమాండ్ చేస్తూ వస్తుంది. దీనితో అవసరం లేదని వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఇక ఆమె కాస్త యాటిట్యూడ్ కూడా చూపిస్తూ ఉంటుంది అనే వారు కొందరు. ప్రస్తుతం కూతుర్ని సినిమాల్లోకి తీసుకు వచ్చే విధంగా ఆమె ప్లాన్ చేస్తుంది. ఆమెను సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంది. ఇద్దరు కలిసి డాన్స్ లు వేస్తున్నారు. మరి ఎంత వరకు సురేఖా వాణీ ఈ విషయంలో విజయవంతం అవుతుంది అనేది తెలియడం లేదు. ఈ మధ్య ఆమె రెండు మూడు సినిమాల్లో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: