పూజా హెగ్డే అందం, అభినయం కలిగిన నటి. ఆమెకు వరస అవకాశాలు టాలీవుడ్లో వచ్చాయి. స్టార్ హీరోల పక్కన అలా మెరిసి కవ్వించింది. ఇక లేటెస్ట్ హిట్ అల వైకుంఠపురంలో పూజ బుట్టబొమ్మ అందం యువత గుండెలను గిలిగింతలు పెట్టేసింది. అందమైన ఆ రూపం కళ్ళకు కట్టేసుకుని కలల్లో ఊరేగేలా చేసింది.

 

ఈ బంపర్ హిట్ తో మళ్ళీ అవకాశాలు వెల్లువలా వస్తాయని పూజ ఎదురుచూసింది. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది మరోటిలా ఇక్కడ  సీన్ ఉంది. పూజను బాగా ఎంకరేజ్  చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.

 

ఇపుడు ఆయన జూనియర్ ఎన్టీయార్ తో  లేటెస్ట్ గా సినిమా కమిట్ అయ్యారు. ఆ మూవీలో మొదట పూజను అనుకున్నారు. అయితే ఇపుడు ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చి చేరింది. దాంతో పూజాకు త్రివిక్రం హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు.  అల సినిమాతోఇ భారీ హిట్ చేతిలో ఉన్నా కూడా పూజను టాలీవుడ్ పలకరించకపోవడంతో ఈ అమ్మడు ఇపుడు కోలీవుడ్ వైపు చూస్తోందట.

 

అక్కడ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ పక్కన నటించే క్రేజీ ఆఫర్ ని పూజా సొంతం చేసుకుందని లేటెస్ట్ టాక్.  సుధా కొంగర డైరెక్షన్లో వచ్చే ఈ మూవీ ఓ విధంగా పూజాకు బిగ్ ఆఫర్ అంటున్నారు. పూజా ఎనిమిదేళ్ళ తరువాత కోలీవుడ్లోకి ఈ విధంగా రీ ఎంట్రీ ఇస్తోందని అంటున్నారు.

 

 2012లో ముగమూడి తమిళ  మూవీలో పూజా నటించింది. ఇపుడు మళ్ళీ బంపర్ ఆఫర్ తో కోలీవుడ్ పలకరించడంతో పూజా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతాయని అంటున్నారు. మరి పూజ సోయగాలు తమిళ తెర మీదనే ఇక చూడాలన్నమాట. ఫ్యాన్స్ మరి  కళ్ళలో వత్తులు వేసుకుని వెయిట్ చేయడమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: