టాలీవుడ్లో మరో నెల ముగిసిపోయింది. మార్చి నెల ప్రారంభమైంది. ఈ రెండు నెలల్లో ఓవరాల్ గా చెప్పుకోవాలంటే మూడు సూపర్ హిట్లు.. ఒక యావరేజ్ సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయ‌నే చెప్పాలి. సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు. అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమాలు మిన‌హా మిగిలిన‌ అన్ని సినిమాలు ప్లాప్‌ అయ్యాయి. ఇక ఫిబ్రవరి నెలలో మొత్తంగా 18 సినిమాలు రిలీజ్ అయితే వీటిలో నితిన్ నటించిన ఒక్క భీష్మ‌ సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది. ఈ నెల చివర్లో వచ్చిన విశ్వక్‌సేన్ హిట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన ర‌న్‌ ప్రారంభించింది.



ఫిబ్ర‌వ‌రిలో 18 సినిమాల్లో భీష్మ‌, హిట్ సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఘోరంగా తన్నేశాయి. ఇక శర్వానంద్ - సమంత జాను, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ ల‌వర్ ప్లాప్ అవ్వగా మిగిలిన సినిమాల పేర్లు కూడా గుర్తు లేని పరిస్థితి. జనవరి 31 న విడుదలైన నాగ‌శౌర్య అశ్వత్థామ' తో ఫిబ్రవరి నెల నీరసంగా ప్రారంభమైంది. ఈ సినిమా లాభాలు తీసుకురాలేకపోయింది. ఇక మూడో వారంలో మ‌హాశివ‌రాత్రి కానుక‌గా వ‌చ్చిన భీష్మ సినిమా వ‌ర‌కు ఫిబ్ర‌వ‌రిలో ఒక్క హిట్  లేదు.



ఇక చివ‌రి వారంలో వ‌చ్చిన హిట్‌ యావరేజ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి వ‌చ్చేసింది. ఇలా ఫిబ్ర‌వ‌రి నెల ఫ‌స్టాఫ్ అంతా ఫ‌ట్ అయితే.. సెంక‌డాఫ్ మాత్రం ఓ హిట్‌... మ‌రో యావ‌రేజ్‌తో కాస్త టాలీవుడ్‌కు ఊపిరి లూదింది. ఇక మార్చి నెలలో చెప్పుకోద‌గ్గ సినిమాలు లేక‌పోవ‌డం.. మ‌రో వైపు ప‌రీక్ష‌ల సీజ‌న్‌, దీనికి తోడు ఐపీఎల్ ఉండ‌డంతో బాక్సాఫీస్ నుంచి ఫిబ్ర‌వ‌రిలో కూడా పెద్ద సంచ‌ల‌నాలు ఆశించ‌క్క‌ర్లేదు. ఇక ఏప్రిల్ నుంచి కాస్త ఊపు వ‌స్తుందేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: