తెలుగు సినిమా తెరపై నిన్నటి తరం స్టార్ హీరోయిన్లు గా ఉన్న వాళ్లంతా ఇప్పుడు ఆంటీలు... అమ్మలు అవతారం ఎత్తారు. వీళ్లలో కొందరు ఆంటీలు... కొందరు అమ్మ క్యారెక్టర్ చేసిన హీరోయిన్లు కొందరు స్టార్ హీరోలకు కొంగు బంగారంగా క‌లిసొస్తున్నారు. వీరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సీనియర్ హీరోయిన్ నదియా చాలా లక్కీ అయ్యారనే చెప్పాలి. అప్పుడెప్పుడో 2001లో వచ్చిన ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్లకు పైగా సరైన హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. 2013లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ నదియా తెలుగు తెరపై గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చారు.



సమంత, ప్రణీత కు అమ్మ‌గా ... పవన్ కు అత్తగా నటించిన నదియా పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉంది. చివరకు సినిమా టైటిల్‌ సైతం అత్తారింటికి దారేది అని త్రివిక్రమ్ పెట్టడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ కు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ లభించినట్లయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మొత్తం ఆన్‌లైన్లో లీక్ అయ్యింది. అయినా ప్రేక్ష‌కులు మాత్రం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.



ఏదేమైనా పవన్ కళ్యాణ్ కు న‌దియా ఆంటీ చాలా లక్కీగా క‌లిసొచ్చార‌నే చెప్పాలి. ఆ తర్వాత అదే నదియా ప్రభాస్ మిర్చి సినిమాలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు. కొంద‌రు హీరోయిన్లు ఆంటీలు, అమ్మ‌ల క్యారెక్ట‌ర్‌లో కొంద‌రికి క‌లిసొస్తారు. ప‌వ‌న్ ఎన్ని సినిమాలు చేసినా అందులో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ప‌వ‌న్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో న‌దియా పాత్ర సైతం చాలా రోజుల వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచేలా ముద్ర వేసింది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: