న‌టి సుహాసిని.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. తమిళనాడులోని చెన్నై సుహాసిని జన్మస్థలం. ప్రముఖ సినిమా నటుడు చారు హాసన్‌ కుమార్తె సుహాసిని. అలా తండ్రి చారు హాసన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సుహాసిని సినిమా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. నిన్నటితరం కుర్రకారులను తనవైపు తిప్పుకొన్న వెండితెర హాసిని... ఆమె సుహాసిని అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏ పాత్రలోనైనా జీవించగల సామర్ధ్యం ఆమె సొంతం. 

 

సుహాసిని తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. సుహాసిని అంటే కేవలం ఓ నటి అని మాత్రమే అనుకుంటే పొరపాటే. సుహాసినికి సినిమా దర్శకత్వం చేసిన అనుభవం కూడా ఉంది. 1996లో ‘ఇందిర’ సినిమా దర్శకత్వ బాధ్యతలను సుహాసిని తన భుజాలపై మోశారు. ఈ చిత్రానికి సుహాసిని స్కీన్ర్‌ ప్లే కూడా సమకూర్చడం విశేషం. ఇక స్టార్ హీరోల స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన సుహాసిని ఆ త‌ర్వాత కెరెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా స‌త్తా చాటారు. అలాగే అటు బాల‌కృష్ణ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన సుహాసిని.. ఇటు క‌ళ్యాణ్ రామ్‌కు త‌ల్లి కూడా న‌టించ‌డం విశేషం.

 

బాల‌కృష్ణ‌, సుహాసిని కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు, బాల గోపాలుడు, ప్రెసిడెంటుగారి అబ్బాయి, రాముడు భీముడు వంటి చిత్రాలు మంచి విజ‌యాన్ని సాంధించాయి. ఇక అదే సుహాసిని లెజెండ్ సినిమాలో చిన్న‌నాటి బాల‌య్యకు త‌ల్లిగా న‌టించింది. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్‌కు కూడా త‌ల్లిగా న‌టించింది. అయితే ఒక‌ప్పుడు హీరోయిన్‌గా చేసినా.. ఇప్పుడు కెరెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చేసినా.. సుహాసిని మాత్రం అదే అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది. ఇక భాషాభేదం అన్న తేడాలు లేకుండా సుహాసిని తన నటనతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో వివాహమైంది. 1988లో మణిరత్నం, సుహాసిని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి నందన్‌ అనే కుమారుడు ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: