సినీ పరిశ్రమలో డేటీంగ్ కల్చర్ ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది.  కొంత మంది నటీనటులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.. అయితే కొంత మంది మాత్రం డేటింగ్ తో సరిపెట్టుకున్నారు. ఇక సినీ పరిశ్రమలో ద్వితీయ, తృతీయ వివాహాలు చేసుకున్నవారు కూడా ఉన్నారు.  అప్పటికే తమకు పిల్లలు ఉన్న ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న నటులు ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రాధిక, హీరో శరత్ కుమార్.  హీరోగా రాణిస్తున్న సమయంలో శరత్ కుమార్ కి ఓ కూతురు ఉంది.  అయితే రాధిక ఇష్టపడంతో విడాకులు తీసుకొని ఆమెను వివాహం చేసుకున్నారు. 

 

తాజాగా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా రాణిస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఇప్పుడు లేడీ విలన్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి శరత్ కుమార్ ను రెండో వివాహం చేసుకున్న నాటి హీరోయిన్ రాధిక, తనకు ఆంటీ మాత్రమేనని, తాను ఆమెను అలాగే పిలుస్తానని, ఆమె తనకు అమ్మ కాదు.. కాలేదు అని అన్నారు.  జన్మనిచ్చిన అమ్మకే నేను ప్రాధాన్యత ఇస్తాను..  వరికైనా అమ్మ ఒక్కరే ఉంటారని, రాధికను ఆంటీ అనే తాను పిలుస్తూ ఉంటానని, ఇదే సమయంలో ఆమెకు గౌరవాన్ని ఇస్తానని చెప్పింది.

 

వివాహ విషయంలో ఎవరి ఇష్టం వారిదే.. ఆ విషయంలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను అన్నారు.  తనకు ఏదనిపిస్తే అదే చేస్తానని, అందుకే తనతో మాట్లాడేందుకు చాలా మంది బయపడుతూ ఉంటారని వ్యాఖ్యానించింది.  ఒకప్పుడు తెలుగు లో నెగిటీవ్ షేడ్స్ లో ఉన్న పాత్రల్లో నటించాలంటే చాలా మంది వెనుకంజ వేసే వారు. కానీ హీరోయిన్ గా నటించి.. అందం అభినయం ఉండీ... మంచి బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా కూడా వరలక్ష్మి లేడి విలన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: