బన్నీకి ప్రత్యర్ధులు ఎక్కువైపోతున్నారు. ఆయన మెగా కాంపుండ్ నుంచి హీరోగా వచ్చినా కూడా తరువాత కాలంలో అల్లువారి అబ్బాయిగానే ముద్ర వేసుకోవాలని తాపత్రపడుతున్నాడు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ కొంతవరకూ మెగా ఫ్యాన్స్ కి దూరమయ్యారని ప్రచారం ఉంది. నేను చెప్పను బ్రదర్ అంటూ అర్జున్ అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యాన్స్ కి గుస్సా తెప్పించాయి. ఇవన్నీ ఇలా ఉంటే అల్లు అర్జున్ మళ్ళీ అల వైకుంఠపురం నుంచి ఫాం లోకి వచ్చాడు.

 

ఈ సంక్రాంతికి భారీ హిట్ కొట్టి తిరుగులేదనిపించుకున్నాడు. ఇక సుకుమార్ తో అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే సంక్రాంతికి అల్లు అర్జున్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో పోటీ పడ్డాడు. ఆ విధంగా కలెక్షన్లు, రిలీజ్ డేట్లు, సినిమా ఆడిన సెంటర్లు అనేక రకాలుగా ఇద్దరు మధ్యన ఇండైరెక్ట్ ఫైట్ నడచింది. ఇపుడు అది మెల్లగా సద్దుమణిగినా కొత్త ఫైట్ ఒకటి ముందుకు రాబోతోందిట.

 

ఆ ఫైట్ ఏంటంటే మహేష్ తోనే మళ్ళీ బన్నీ యుధ్ధం చేయాల్సిరావడం. మహేష్ ఇపుడు మెగా క్యాంప్ కి చేరువగా వస్తున్నాడు. తన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా మహేష్ పిలిచాడు. మరో వైపు రాం చరణ్ తో కూడా మహేష్ కి మంచి రాపో ఉంది. దాన్ని మరింతగా గట్టిపరచేలా కొరటాల చిరంజీవి మూవీలో మహేష్ ఒక కీలకమైన ప్రత్యేక అథిధి పాత్ర పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.

 

అదే జరిగితే ఈ బంధం మరింతగా విస్తరించి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇలా ఉంటే మహేష్ ప్లేస్ లోకి ఇపుడు బన్నీ రావాలనుకుంటున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. అంటే మెగాస్టార్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకవాలని బన్నీ గట్టిగా భావిస్తున్నాడుట. ఎపుడో డాడీ మూవీలో కొన్ని సెకండ్లు కనిపించడం తప్ప బన్నీ ఎపుడు చిరంజీవి సినిమాల్లో నటించలేదు.

 

ఆ ముచ్చట ఇపుడు తీర్చుకోవాలనుకుంటున్నాడుట. కొరటాల చిరంజీవి మూవీలో ప్రత్యేక పాత్ర తాను వేయాలనుకుంటున్నాడుట. ఇందుకోసం తన తండ్రి అల్లు అరవింద్ తో పాటు, కొరటాల శివతోనూ రాయబేరాలు సాగిస్తున్నాడని టాక్. అయితే ఇప్పటికే మహేష్ ని  ఈ పాత్రకు ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో బన్నీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. అంటే ఓ విధంగా బన్నీ మహేష్ తోనే డైరెక్ట్  ఫైట్ చేస్తున్నట్లుగా సీన్ ఉందని అంటున్నారు. మహేష్ తప్పుకుంటే బన్నీ ఎంటర్ కావచ్చు. అది జరుగుతుందా, కుదురుతుందా. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: