బాలయ్య అంటేనే పక్కా మాస్. ఆయన కనిపిస్తేనే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. అందరు హీరోలకూ ఒక్కో స్టైల్ ఉంటుంది. బాలయ్య స్టైల్ ఆయన డైలాగ్ డెలివరీ, గుక్కతిప్పుకోకుండా భారీ డైలాగులు వల్లించమంటే బాలయ్యే సాటి. ఆయనకు లేరు పోటీ. బాలయ్య డైలాగులతోనే ఆడిన సినిమాలు కోకొల్లలు. అటువంటి బాలయ్యని బోయపాటి ఈసారి  ఏం చేయబోతున్నారు.

 

ఇపుడు అవే ఫ్యాన్స్ లో పెద్ద డౌట్లు. బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీలో అఘోరా పాత్ర ఒకటి ఉందిట. ఈ పాత్రకు అసలు డైలాగులు పెద్దగా ఉండవుట. పూర్తిగా ఆధ్యాత్మిక భావ‌నతో నిండి ఉండే ఈ పాత్ర సినిమాకే హైలెట్ అంటున్నారు. ఈ పాత్ర సినిమా రెండవ పార్టులో వస్తుంది. అంటే అచ్చంగా సింహా. లెజెండ్ మూవీస్ లో రెండవ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగన్న మాట.

 

అయితే ఈ రెండవపాత్రను బోయపాటి ఈసారి వేరే విధంగా డిజైన్ చేస్తున్నాడుట. సింహా లో చూడు ఒక వైపే చూడు అంటూ డైలాగులో రెండవ పాత్ర అదరగొడుతుంది. లెజెండ్ లో కూడా సీనియర్ బాలయ్య ఎంటర్ తోనే సినిమా ఎక్కడికో పోతుంది. ఇపుడు అఘోరా పాత్ర ఎంట్రీ అలాగే ఉంటుందిట. అయితే పెద్దగా  డైలాగులు ఉండవని చెబుతూండడంతో ఫ్యాన్స్ లో అపుడే నీరసం వచ్చేస్తోందట.

 

బాలయ్య అంటేనే డైలాగులకు పెట్టింది పేరు. అటువంటి బాలయ్య సినిమాలో డైలాగులు లేకపోవడం, ఉన్నా తక్కువగా ఉండడం అంటే ఫ్యాన్స్ తట్టుకోగలరా. ఇక ఈ సినిమాలో బాలయ్య ఆధ్యాత్మిక పాత్ర వేస్తే మాస్ ఫ్యాన్స్ నచ్చుతుందా. అర్ధమవుతుందా అన్న కొత్త డౌట్లు కూడా వస్తున్నాయట. 

 

ఏది ఏమైనా బోయపాటి, బాలయ్య మూవీ అంటే ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ ఉంటాయి. వాటిని రెట్టింపు చేసేలా మూవీ తీస్తాడనుకుంటే ఈ సైలెంట్ బాలయ్య ఏంటి అని షాక్ తింటున్నారుట. అయితే ఇవన్నీ ఊహాగానాలే కాబట్టి బెంగ అక్కరలేదు. పైగా బోయపాటికి తెలుసు బాలయ్య ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో. ఆ విధంగా ఆయన డిజైన్ చేసి ఉంటారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: