ఈ మధ్య కాలంలో సినిమాలు ఏ విదంగా మారాయో వేరేలా చెప్పనక్కర్లేదు. నా బూతో న భవిష్యత్ అన్నట్లు సినిమాలు తెర మీద దర్శనమిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నో సినిమాలు శృతి మించిన  శృంగారపు సీన్లతో సినిమాలో వారానికి ఒకటి విడుదల అవుతూ ప్రేక్షకుల విమర్శలను అందుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన డిగ్రీ కాలేజ్ సినిమాను బ్యాన్ చేయాలనీ వార్తలు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. 

 

 

ఇప్పుడు అంతకు మించి చుపిస్తామంటూ మరో సినిమా తెరపై దర్శమిచ్చేందుకు రెడీ అవుతుంది. బంజారా పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో లంబాడీ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులపైనా ఈ సినిమా కథ ఉండనుంది. అయితే ఈ సినిమాలో లంబాడీల సంస్కృతిని కించపరిచే విదంగా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటుంది. 

 

 


అంతేకాకుండా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు అయినా లంబాడీలను కించపరిచే విదంగా అస్లీల సన్నివేశాలు ఉన్నాయని, స్త్రీల పట్ల నీచంగా సంబోదించారని వారు అన్నారు.కవాడిగూడ సీజీఓ టవర్స్‌లోని కేంద్ర సెన్సార్‌ బోర్డు కార్యాలయంలో పలువురునాయకులు  సెన్సార్‌ బోర్డు అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

 

 

 

అనంతరం వారు మాట్లాడుతూ.. లంబాడీ ల సంస్కృతిని సంప్రదాయాలను, మనోభావాలను కించపర్చే విధంగా ఒక అసభ్యకర అశ్లీల చిత్రానికి ‘బంజారా’ అనే నామకరణం చేయడం తగదన్నారు. చిత్రంలో లంబాడీల వేషధారణ...దుస్తులతోఈ సందర్బంగా  సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, చిత్ర నటులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఈ సినిమాపై ఇప్పటికే పలు నిరసనలు వెలువడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: