వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్.. గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు వెంకీ. మ‌రి వెంకీని ఆడేసుకున్న ఆ ఆంటీ ఎవ‌రు..? ఏ విష‌యంలో ఆగేసుకుంది..? అన్న ప్ర‌శ్న‌లు ఇప్ప‌టికే మీ మైండ్‌లోకి వ‌చ్చుంటాయి. ఆ విష‌యం తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోందాం.

 

వెంక‌టేష్ సినీ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించిన సినిమాలో `ఎఫ్ 2` కూడా ఒక‌టి. వెంకటేష్తమన్నా , వరుణ్ తేజ్ – మెహరీన్ ల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌లా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 85 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది ఎఫ్ 2 . ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వచ్చిన ఎఫ్ 2 నవ్వుల పువ్వులు పూయించింది. అయితే ఈ చిత్రంలో వెంక‌టేష్‌ను ఓ రేంజ్‌లో ప్ర‌గ‌తి ఆంటీ ఆడేసుకుంది. 

 

ఆ చిత్రానికి హైలైట్ కూడా ప్ర‌గ‌తి ఆంటీ వెంక‌టేష్‌తో ఆడుకున్న‌ కామెడీ అనే చెప్పాలి. ఇలా రీల్ లైఫ్‌లో వెంకీని ప్ర‌గ‌తి ఆంటీ ఓ ఆట ఆడుకుంద‌న్న‌మాట‌. కాగా, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో న‌టించిన న‌టి ప్ర‌గతి.. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్తూ ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు. తెలుగులో యంగ్ హీరో, హీరోయిన్ల‌కు అమ్మగా, అత్త‌గా ఎక్కువ పాత్రలు చేశారు ప్ర‌గ‌తి. ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తల్లి పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ప్రగతి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: