స్టార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్‌. లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూతురిగా తెరంగేట్రం చేసిన ఈ భామ సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లోనూ సత్తా చాటింది. అయితే కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే లుక్‌ పరంగా విమర్శలు ఎదుర్కొన్న శృతి హాసన్‌ వెండితెరకు దూరమైది. అదే సమయంలో ప్రేమ వ్యవహారం కారణం కూడా ఈ భామ సినిమాలకు దూరమైనట్టుగా వార్తలు వినిపించాయి.

 

లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేసి.. ఆ తర్వాత విడిపోయింది ఈ జంట. అయితే బ్రేకప్‌ తరువాత తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టింది ఈ భామ. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శృతి హాసన్‌. శృతి కేవలం నటించమే కాదు.. తనో సంగీత దర్శకురాలుగా కూడా పేరు తెచ్చుకుంది. అప్పట్లో కమల్ హాసన్, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈనాడు మూవీకి ఈ భామనే సంగీతం అందించింది.

 

ఇటీవల లుక్‌ కోసం తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటున్న వెల్లడించి అందరికీ షాక్‌ ఇచ్చిన శృతి హాసన్‌ తాజాగా క్లీవేజ్‌ షోతో రచ్చ చేసింది. బాలీవుడ్‌ నటి కాజోల్‌ తో కలిసి నటించిన దేవీ షార్ట్‌ ఫిలిం ప్రీమియర్‌ షో సందర్భంగా బ్లాక్‌ సూట్‌లో కనిపించింది శృతి. ఈ డ్రెస్‌ లో డీప్‌ క్లీవేజ్‌ షోతో రెడ్ కార్పెట్ మీద రచ్చ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🖤

A post shared by @ shrutzhaasan on

మరింత సమాచారం తెలుసుకోండి: