చిన్నప్పుడు స్కూల్లో ఆలస్యంగా వస్తే టీచర్లు గోడ కుర్చి, గుంజీలు తీయిస్తారు... లేదా కర్రతో నాలుగు వాయిస్తారు... ఇది స్కూల్లో ఈ అనుభవాలు చాలా మంది విద్యార్థులకు ఉంటాయి.  అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకు పోతున్న ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ ని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గుంజీలు తీయించడం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  బాలీవుడ్ లో వారసత్వపు హీరోలు వస్తున్న సమయంలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కేవలం తన స్వయంకృషితో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్.  బాలీవుడ్ ని ఒకపుడు ఏలేసిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ కన్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ట్వింకిల్ ఖన్నా తెలుగు లో వెంకటేష్ నటించిన శీను చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలులో మళ్లీ నటించలేదు. 

 

ఇక బాలీవుడ్ లో ఈ తరహాలోనే ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రణ్ వీర్ సింగ్.  ప్రస్తుతం వరుస హిట్స్ తో దుమ్మురేపుతున్నాడు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొనెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రణ్ వీర్ సింగ్. తాజాగా తన భార్య దీపికా పదుకొనే ఇంట్లో ఉన్న కారణంగా ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాడట. అందుకని రణ్ వీర్ సింగ్ తో హీరో అక్షయ్ కుమార్ గుంజీలు తీయించాడు.  అసలు విషయానికి వస్తే.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా 'సూర్యవంశీ' చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ లు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. 

 

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ చేశారు. అయితే ఈ రిలీజ్ ఫంక్షన్ కి రణ్ వీర్ సింగ్ 40 నిమిషాలు లేటుగా వచ్చాడు.  అతని కోసం ఎదురు చూశారు.. ఇక రణ్ వీర్ సింగ్ రాగానే చిర్రెత్తుకొచ్చిన అక్షయ్ ఈ హీరోని గుంజీలు తీయమని చెప్పాడు.  సీనియర్ హీరో చెప్పడంతో మనోడు గుంజీలు తీయడం మొదలు పెట్టాడు.. పక్కనే ఉన్న అజయ్ దేవగాన్ ఆపి వదిలేయ్.. వాళ్లావిడ ఇంట్లో ఉంది. అందుకే మనవాడు లేట్ గా వచ్చాడు అన్నాడు. దాంతో అందరూ నవ్వుకుంటూ ఫంక్షన్ గ్రాండ్ గా కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#ranveersingh gets punishment from Discipline king #akshaykumar who calls press at six in the morning for interviews 😜🙈 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

మరింత సమాచారం తెలుసుకోండి: