సురేఖా వాణి మంచి హాస్య నటి. చక్కటి పాత్రలతో, మంచి యాక్టింగ్తో ఎంతగానో మెప్పిస్తుంది. అనేక తెలుగు సినిమాలలో నటించి చక్కటి పేరు పొందింది. చిన్ననాటి నుండి యాంకరవ్వాలని కలలు కన్నది. ఇంటర్ పూర్తయ్యాక యాంకర్ అవ్వాలని నిర్ణయించుకుంది. మా టాకీస్, హార్ట్ బీట్ వంటి ప్రొగ్రామ్స్ లో ఈమె యాంకర్గా చేసింది.

 

IHG

 

 

అలానే ఆమె భర్త డైరెక్ట్ చేసిన మొగుడ్స్ పెళ్ళమ్స్ లో ఆమె యాకరింగ్ చేసింది. ఆమె భర్త తేజ ఆమెకి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ జంట ప్రొగ్రామ్స్ తో  కట్టి పడేసింది ప్రేక్షకులని. సురేఖావాణి ఆ తర్వాత నెమ్మదిగా సినీ కెరియర్ని ప్రారంభం చేసింది. ఎన్నో పాత్రలతో ఆకట్టుకుంటుంది సురేఖావాణి. ఈమె భార్యగా, వదినగా, చెల్లిగా ఎన్నో సినిమాలలో నటించింది.

 

క్షణాలలో హాస్యాన్ని పండిస్తోంది సురేఖావాణి. మంచి హాస్య నటుడు కనుక సీన్లో జతకడితే ఇంకా అంతే సంగతులు. నవ్వుకోవాల్సిందే ఆ సమయమంతా. చిన్ననాటి నుండి కన్న కలలు ఫలించాయి ఆమె జీవితంలో. ఆమె శీనుగాడు, భద్ర,  ఒక్కడే, బొమ్మరిల్లు, నోట్బుక్, దుబాయ్ శీను, రెడీ, నేను మీకు తెలుసా, ఉల్లాసంగా ఉత్సాహంగా, బోణి, ఓయ్, ఎవరైనా ఎపుడైనా, నిర్ణయం, బావ, ప్రస్థానం, దేనికైనా రెడీ, బెంగాల్ టైగర్, శ్రీమంతుడు ఇలా అనేక తెలుగు సినిమాలలో నటించింది సురేఖావాణి.

IHG

 

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించింది. విశ్వాసం, వంత రాజవతాం ఆరువేన్, లిసా వంటి తమిళ చిత్రాలలో నటించింది. ఇంత హ్యాపీగా నవ్వించే ఈమె తన భర్తకి జబ్బు చేసినప్పుడు, మరణించినప్పుడు తట్టుకుని కుమిలిపోయింది. తన భర్త వ్యాధి గురించి తెలియజేయలేదు. జబ్బు చేసి ఆసుపత్రిలోనే మరణించాడు తన భర్త  తేజ 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: