టాలీవుడ్ లోనాని హీరోగా వచ్చిన “మజ్ను” సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్.  వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా నటించింది.  దాంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తాయని భావించారు.  కానీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అమ్మడి ఆశలపై నీళ్లు జల్లినట్టయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాల‌న్‌” తెలుగులో “డిటెక్టివ్” గా వచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకున్నా రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు.  

 

ఇక వరుసగా సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.  అయితే సినీ పరిశ్రమ అంటే ఎప్పటికప్పుడు కొత్త అందాలతో హడావుడి ఉంటుంది.  కొత్త అందాలు ఎప్పటికప్పుడు దిగుమతి అవుతుంటే కాంపిటేషన్ తట్టుకోవడం కష్టమే మరి. అలా అవకాశాలు దక్కకపోవడం తో సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు కొందరు భామలు.  తన స్టనింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ... కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది అను ఇమ్మాన్యూయేల్. హీరోయిన్ గా మంచి అందం.. అభినయం ఉన్నా.. ఈ భామకు సరైన అవకాశం వచ్చి హిట్ పడితే.. తన సత్తా చూపిస్తానంటుంది.  

 

గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు దేనికైనా సిద్దమే అంటుంది. తనలో అందాలను బయట పెడుతూ నెటిజన్లకు మత్తెక్కిస్తోంది. తాజాగా అను ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. సన్నజాజి లాంటి నడుముతో మెరుపు తీగ లా అలా నిలుచొని ఒళ్ళు విరుచుకుంటున్న ఫోజు కి కుర్రాళ్ళ మతులు పోతున్నాయి. ఇక బెల్లంకొండ శ్రీను సరసన ఓ మూవీలో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.  ఈ మూవీ ఫుల్ లెన్త్ ఎంట్ర టైన్ మెంట్ గా తెరకెక్కిస్తున్నారట.  ఈ మూవీ మంచి సక్సెస్ సాధిస్తే అమ్మడి జాతకం మారినట్లే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: