టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం తరువాత అంతటి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఒకప్పుడు రోజుకు ఆరేడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేవాడు. ఒకానొక దశలో సునీల్ లేకుండా సినిమా తెరకెక్కేదే కాదు. సునీల్ కామెడీకి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కానీ హీరోగా కెరీర్ మొదలుపెట్టి సునీల్ కెరీర్ ను నాశనం చేసుకున్నాడు. మొదట్లో హీరోగా హిట్లు అందుకున్న సునీల్ హీరో పాత్రలపై దృష్టి పెట్టి కమెడియన్ పాత్రలకు దూరమయ్యాడు. 
 
పూల రంగడు తరువాత సునీల్ హీరోగా నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. ఆ తరువాత సునీల్ కామెడీ పాత్రల వైపు చూసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. జూనియర్ ఎన్టీయార్ అరవింద సమేత, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా సునీల్ పాత్రలు పెద్దగా అలరించలేకపోయాయి. డిస్కోరాజా సినిమాలో సునీల్ విలన్ గా కొత్త గెటప్ లో కనిపించినా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో సునీల్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 
 
సునీల్ కెరీర్ మొదట్లో రెండు మూడు గంటలకు లక్షల్లో పారితోషికం అందుకునేవాడు. ఆ తరువాత హీరోగా సునీల్ 2 నుండి 3 కోట్ల రూపాయలు తీసుకునేవాడు. కానీ ఇమేజ్ తగ్గడంతోప్రస్తుతం సునీల్ రోజుకు కేవలం 2 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. సునీల్ రోజంతా కాల్షీట్ ఇస్తే మాత్రమే నిర్మాతలు రెండు లక్షలు ఇస్తున్నారని లేకపోతే అందులోనూ కోతలు ఉంటాయని తెలుస్తోంది. 
 
కమెడియన్ గానే సునీల్ కొనసాగి ఉంటే సునీల్ కేరీర్ ఇప్పటికి ఎలా ఉండేదో చెప్పలేము కానీ హీరో వేషాలెయ్యడం వల్ల సునీల్ కెరీర్ ఎటూ కాకుండా పోయింది. ప్రస్తుతం సునీల్ కలర్ ఫోటో సినిమాలో ఎస్సై రామరాజు అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: