ఎప్పుడు వచ్చామా కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా... మహేష్ కొట్టిన ఈ డైలాగ్ ‘పోకిరి’ చిత్రంలో థియేటర్లో దుమ్మురేపింది. ఈ డైలాగ్ ఇప్పటికీ స్ఫూఫ్ గా వాడుతూనే ఉంటారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది.  ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ ఏపిలో జరిగిన ఎన్నికల బిజీలో ఉండి పోయారు.  అయితే జనసేన  పార్టీ తరుపు నుంచి ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.   ప్రస్తుతం మళ్లీ తెరపై కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ రిమేక్ లో నటిస్తున్నారు పవన్ కళ్యాన్. 

 

ఇక అజ్ఞాత వాసి చిత్రం వచ్చి రెండేళ్లు గడుస్తుంది.  పవన్ కళ్యాన్ ని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.  అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ చిత్రం 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ నిన్నే విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను అభిమానులు జోరుగా ట్రెండింగ్ చేశారు. సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్స్ వల్ల కమర్షియల్ హిట్స్ వస్తాయని మరోసారి రుజువైంది.  శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబచ్చన్, కోలీవుడ్ లో అజిత్ కుమార్ నటించి మంచి విజయం అందుకున్నారు.   

 

పవన్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని తెలుగు వెర్షన్లో మార్పుచేర్పులు చేశారు.  రెండేళ్లు గా వెయిట్ చేసిన అభిమానులకు పవర్ స్టార్ అదిరిపోయే కిక్కిచ్చాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే మెగా ఫ్యాన్స్ ఆనందాల్లో మునిగిపోయారు.  సోషల్ మీడియాలో ట్రేండింగ్ లిస్ట్ లో టాప్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ దర్శనమిచ్చింది. ఇక నిన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సూర్యవంశీ ట్రైలర్  టాప్ ట్రేండింగ్ లిస్ట్ లో ఎక్కువ సేపు నిలవలేకపోయింది.  ఫస్ట్ లుక్కే ఈ రేంజ్ లో ఉంటే.. టీజర, ట్రైలర్ ఏ స్థాయి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: