చియాన్ విక్రమ్, యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ నే మించిపోయాడు. కమల్ దశావతారాలతో మాయచేస్తే.. ఈ సినీ అపరిచితుడు ఏకంగా ఇరువై అవతారాలతో ఆశ్చర్యపరుచబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో సప్తావతారాలతో సర్ ప్రైజ్ చేసిన విక్రమ్ బిగ్ స్క్రీన్ పై వండర్ చేయబోతున్నాడట. 


కోలీవుడ్ లో కమల్ హాసన్ తగ్గ స్థాయిలో ప్రయోగాలు చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో చియాన్ విక్రమ్ కూడా ముందు వరుసలోనే ఉంటాడు. వరుస పరాజయాలతో విక్రమ్ ఈ మధ్య కాస్త స్లో అయిపోయాడు. దీనికి తోడు ఈ వైర్సటైల్ యాక్టర్ ప్రయోగం చేసినా.. కమర్షియల్ మూవీ చేసినా కలిసి రావడం లేదు. దీంతో ఈ సారి ఏకంగా బిగ్ స్క్రీన్ పై వండర్ క్రియేట్ చేయడానికి పూనుకున్నట్టు కనిపిస్తోంది. 

 

విక్రమ్ న్యూ మూవీ కోబ్రా ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ అదిరిపోయింది. చిత్ర సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ ఫస్ట్ లుక్ ని ఫ్యాన్స్ కు షేర్ చేశాడు. ఫస్ట్ లుక్ లో విక్రమ్ ఏడు డిఫరెట్ గెటప్పుల్లో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఏడు రూపాలు దేనికదే స్పెషల్ గా కనిపిస్తున్నాయి. కొన్ని గెటప్స్ లో విక్రమేనా.. అనేంత డిఫరెంట్ గా ఉన్నాడు. కోబ్లా ఆ ఏడుగురినా శాసిస్తుంటాడా అనేది సస్పెన్స్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. 

 

ఫస్ట్ లో అద్దంలో తనను తాను చూసుకొని అరుస్తుంటే ఇతర రూపాల్ని డిస్ ప్లే చేయడం ఆసక్తి కలిగిస్తోంది. ఏడు రూపాలు రివీల్ చేసిన ఈ సినిమాలో మొత్తం 20రూపాల్లో కనిపించి షాకిస్తాడని సమాచారం. ఇంతకు ముందు దశావతారంలో కమల్ హాసన్ 10రూపాల్లో కనిపిస్తేనే అభిమానలు థ్రిల్లయ్యారు. ఇప్పుడు చియాన్ ఫ్యాన్స్ కు అంతకంటే చిలౌట్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతోనైనా విక్రమ్ బాక్సాఫీస్ వద్ద మాయ చేస్తాడేమో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: