తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటారు.  ఆయన నటించిన ఫ్యాక్షన్ తరహా చిత్రాలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఇక ఇండస్ట్రీలో బోయపాటి శ్రీనివాస్ అంటే ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటారు.  బోయపాటి చిత్రాల్లో ఒళ్లు ఝలదరించేలా భారీ ఫైట్స్ ఉంటాయి.  వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో  ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు వచ్చాయి.  లెజెండ్ అయితే రికార్డుల మోత మోగించింది.  కొంత కాలంగా వీరిద్దరికీ  వరుస ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.. దాంతో మరోసారి మంచి హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఓ చిత్రం తీస్తున్నారు.  ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఒక పాత్రలో ఆయన అఘోరాగా కనిపిస్తారని తెలుస్తోంది. 

 

ఈ పాత్ర లో బాలయ్య చాలా సైలెన్స్ గా కనిపిస్తారట.... కేవలం యాక్షన్ మాత్రే ఉంటుందని సమాచారం.  ఒక పాత్ర చాలా స్మార్ట్ గా రాయల సీమ కుర్రోడిగా కనిపిస్తారట. అచితే పాత్రల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన 25 కిలోలకుపైగా బరువు తగ్గారు. వారణాసి నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా అంజలితోపాటు మరో కథానాయిక కూడా కనిపించనున్నారని తెలుస్తోంది.  ‘సింహా’, ‘లెజెండ్‌’  చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది.  ఈ చిత్రం పై ఇద్దరికీ ఎన్నో ఆశలు ఉన్నాయి.

 

ఇటీవల పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. చిత్రీకరణలో భాగంగా బాలకృష్ణపై ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ‘స్టార్ట్‌ కెమెరా, యాక్షన్‌, నా కొత్త సినిమా షూటింగ్‌ నేటి నుంచి ఆరంభమైంది’ అని బోయపాటి పేర్కొన్నారు.  ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అంజలితోపాటు మరో కథానాయిక కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. మణిశర్మ స్వరాలు అందించనున్నారు. విలన్‌గా శ్రీకాంత్‌ నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: