అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య పాండే మొట్టమొదటిగా జతకట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ముంబై మహానగరంలో జరుగుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ బైక్ పై అనన్య పాండే సెక్సీగా కూర్చొని ఉన్న ఒక ఫోటో నెట్టింట కేక పెట్టించిందన్న విషయం తెలిసిందే.

 

 

ఐతే ఆ సెక్సీ స్టిల్ ని ఇంకా మరవకముందే వీరిద్దరికి సంబంధించిన మరొక ఫోటో సోషల్ మీడియా తెరపైకి వచ్చి వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే లతో పాటు ఫైటర్ కో-ప్రొడ్యూసర్ చార్మి కౌర్ కనిపిస్తుంది. ఈ వైరల్ అవుతున్న ఫోటో లో విజయ్ దేవరకొండ... నిల్చున్న అనన్య పాండే నడుముపై చెయ్యేసి తన తలని ఆమె కడుపుకి తాకేలా ఉంచగా... అనన్య పాండే మాత్రం 'అయ్యో, ఏంటీ సరసం వదులేహె' అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈ పిక్చర్ ని విజయ్, అనన్య షూటింగ్ సెట్స్ కి వెళ్లేటప్పుడు తీసినట్లు తెలుస్తోంది.



ఇకపోతే ఈరోజు ఉదయం అనన్య పాండే ముంబై మిర్రర్ తో మాట్లాడుతూ... 'ఈ సినిమాలో క్యారెక్టర్ నా నిజ జీవిత క్యారెక్టర్ లాగానే ఉంటుంది. సినిమాలో ని క్యారెక్టర్ అందరి అమ్మాయిల రోజు వారి జీవితం లాగానే ఉంటుంది. ప్రస్తుతం నేను అన్ని భాషలలో డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. విజయ్ దేవరకొండ బాగా మాట్లాడుతాడు, క్యూట్ గా ఉంటాడు' అంటూ తన పాత్రతో పాటు కో యాక్టర్ గురించి చెప్పుకొచ్చింది. ఏదేమైనా ప్రస్తుతం నెట్టింట తాజాగా దర్శనమైన ఫోటో ని చూసి షూటింగ్ బయట కూడా విజయ్ అనన్య పాండే ని బాగా నలిపేస్తున్నాడని నెటిజనులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాని కరణ్ జోహార్ కో ప్రొడ్యూస్ చేస్తుండగా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా వెల్లడించలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: