తన అందంతో నటనతో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకుంది ఈ భామ. ఎస్ఎంఎస్ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ చెన్నై బ్యూటీ. అందాల భామ ఎవరో కాదండి మన రెజీనా కసండ్ర. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ రెజీనాకు తెలుగులో సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

 

గత ఏడాది ‘ఎవరు’ సినిమాతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు. రెజీనా ఇప్పుడు మరో మిస్టరీ థ్రిల్లర్‌ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?!’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. 

 

‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సినిమాతో సూప‌ర్‌ హిట్ అందుకుని తన ప్రత్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శకుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఇనుప చువ్వల మ‌ద్య బంధీగా ఉన్న మ‌హారాణి పాత్రధారిగా రెజీనా క‌సండ్ర లుక్‌ టెర్రిఫిక్‌గా ఉంది.

 

తమిళ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. తమిళంలో ఈ చిత్రానికి ‘శూర్పణగై’ అనే టైటిల్ పెట్టారు. తెలుగులో శూర్పణఖ అని అర్థం. ఈ సినిమాను సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్త. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

 

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ.. ‘‘మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా..?!’ సినిమాను కార్తీక్ రాజు అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు వ‌రుణ్‌ తేజ్‌ మా సినిమాలోని రెజీనా లుక్‌ను విడుద‌ల చేశారు. రెజీనా లుక్‌కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌ గా క‌న‌ప‌డ‌తారు. న‌టిగా ఆమెను మ‌రో యాంగిల్‌లో ఆవిష్కరిస్తున్న చిత్రమిది.

మరింత సమాచారం తెలుసుకోండి: