తెరపై అరసెకను పాటు.. హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటే.. థియేటరంతా ఈలలతో హోరెత్తిపోవాల్సిందే. మరి అలాంటిది ఏకంగా నాలుగు నిమిషాల పాటు ముద్దు సీటు ఉంటే ఇక థియేటర్ ఎలా ఉండాలి.. హోరెత్తిపోదూ.. కానీ ఆ సినిమాలో ఆ నాలుగు నిమిషాల ముద్దు సీన్ సమయంలో మాత్రం ధియేటర్ పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది.

 

 

ప్రేమ కథలను హృద్యంగా తెరకెక్కించడంలో నేర్పరి అయిన మణిరత్నం తీసిన దృశ్య కావ్యం గీతాంజలి సినిమాలోదీ అతి పెద్ద ఎంగిలి ముద్దు సీన్.. సహజంగా సినిమాల్లో ముద్దులు ఓ సన్నివేశంలోనో.. ఓ సంఘటనగానో చిత్రీకరిస్తారు. మహా అయితే ఓ నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉండదు. కానీ గీతాజంలి సినిమాలోని ఈ ముద్దు సీన్ ఏకంగా పాటంతా ఉంటుంది.

 

 

హీరో హీరోయిన్ ను ముద్దు పెట్టుకుంటాడు.. అంతే.. ఆ ఒక్క ముద్దు సీనే ఏకంగా పాటంతా ఉంటుంది. కెమేరా ఆ ఇద్దరి చుట్టూ తిరుగుతూ ఉంటే.. హీరో, హీరోయిన్ అలా ముద్దుకంటూ ఉంటారంతే.. ఈ పాటకు సాహిత్యం కూడా అద్భుతంగా ఉంటుంది..

 

ఓం నమః నయన శృతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జాతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసేవేళలో..
ఈ మంచు బొమ్మలొకటై కలిసి కరిగే లీలలో
రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిది..లోకము తోచగా..
కాలము లేనిది..గగనము అందగా..
సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం..
ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా..వేకువ నేనుగా..
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా..
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అథిదులై జననమందిన ప్రేమ జంటకు ఓం.. ఓం నమః

 

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం మరియు మలయాళం భాషలలోకి కూడా డబ్బింగై అక్కడా విజయం సాధించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: