బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు.  నటుడు, దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్ ‘కహోనా ప్యార్ హై’ మూవీతో హీరోగా పరిచం అయ్యాడు.  ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది.  తర్వాత సైన్స్ ఫిక్షన్ కోయీ మిల్ గయా తో మంచి హిట్ అందుకున్నాడు.  ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని కూడా అందుకున్నారు.  అగ్నిపథ్, క్రిష్ 3 సినిమాలు బాలీవుడ్ లో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల జాబితాలో నిలిచాయి. హృతిక్ రోషన్ యువతుల కలల రాకుమారుడు.

 

ఆమాటకొస్తే ఆసియాలోనే మోస్ట్ సెక్సీయెస్ట్ సెలబ్రిటీలుగా హృతిక్ వరుసగా రికార్డులకెక్కుతున్నాడు. ఇటువంటి సినిమాలు ఆయనను బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా నిలబెట్టాయి.  చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు హృతిక్. జస్ట్ డాన్స్ అనే డాన్స్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. హృతిక్ ని సూపర్ హీరో చేసిన క్రిష్ ప్రాంఛైజీ  నుంచి నాలుగో చిత్రం రాబోతోంది. క్రిష్ 4కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ప్రారంభించారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 

గతంలో ఇక దీపికా పదుకొనె గురించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దీపికా పదుకొనె తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. హృతిక్ రోషన్.. ఐశ్వర్య  రాయ్, ప్రియాంక చోప్రా లాంటి  హీరోయిన్లు నటించారు.  ప్రస్తుతం దీపికతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాను కూడా హృతిక్ తో కలసి నటించే క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు బాలీవుడ్ టాక్.  మరి క్రిష్ 4 ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: