అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఇది. విజయ్ దేవరకొండలోని టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. అంతకు ముందు కూడా పెళ్లి చూపులు వంటి హిట్ మూవీ ఉన్నా.. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ జీవితాన్నే మార్చేసింది. ఓ భగ్న ప్రేమికుడిగా .. ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన పాత్రలో విజయ్ దేవరకొండ జీవించాడు.

 

 

ఇక బోల్డ్ మూవీగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం.. ఈ సినిమాపై ఎన్నో విమర్శలు, ప్రశంసలు.. అబ్బో అదో చరిత్ర.. అయితే ఈ సినిమా ఇంతగా వివాదాస్పదం కావడానికి ఈ సినిమాలోని ముద్దు సస్నివేశాలు కూడా ఓ కారణం. సినిమాలో ముద్దు సీన్లు మరీ ఓవర్‌గా ఉన్నాయని, బూతులు ఉన్నాయంటూ సినిమాపై విమర్శల వర్షం కురిసింది.

 

 

ఈ సినిమాలో దాదాపు 20కి పైగా ముద్దు సీన్లు ఉన్నాయి... అసలు ఓ తెలుగులో ఇంత అవసరమా? అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే ఈ ముద్దులను సమర్థించిన వారూ ఉన్నారు. హిందీలో ఎప్పటి నుండో ముద్దు సీన్లు వస్తున్నాయి.. హిందీలో ఉన్నపుడు తెలుగులోనూ అలాంటి సినిమాలు రావడంలో తప్పులేదని కొందరు అన్నారు. వాళ్లు, మనం ఒకటే దేశం, ఒకటే మనుషులం అయినప్పుడు తప్పేంటి' అని ప్రముఖులూ వ్యాఖ్యానించారు.

 

 

ఏదేమైనా అర్జున్ రెడ్డి అంతగా సంచలన విజయం సాధించిందంటే అందుకు ఈ ముద్దు సీన్లూ ఓ కారణమే. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'అర్జున్ రెడ్డి' మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయం నమోదు చేసింది. సినిమా హిట్ టాక్, కలెక్షన్లు ఎంత బావున్నాయో... సినిమాపై విమర్శలు కూడా అదే రేంజిలో వచ్చాయి. అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: